Tuesday, April 5, 2011

కడప జిల్లాలో ఊపందుకున్న"ఎలక్షన్‌ ఫీవర్‌"


కడప జిల్లాలో ఊపందుకున్న"ఎలక్షన్‌ ఫీవర్‌"
కడప జిల్లాలో ఎలక్షన్‌ ఫీవర్‌ ఊపందుకోనుంది. రేపటి నుంచి ప్రచార భేరీ మోగించనున్నారు YSR కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి. తనను ఓడించేందుకు కాంగ్రెస్‌, TDPలు మళ్లీ కుమ్మక్కయాయన్న జగన్‌ ఆ పార్టీలపై ఎలాంటి విమర్శలు ఎక్కుపెడతారన్నది ఆసక్తిగా మారింది. అటు తల్లి YS విజయమ్మపై బాబాయి వివేకా పోటీ చేస్తుండడంతో యువనేత చేయబోయే ప్రచారం జనాల్లో ఉత్కంఠ రేపుతోంది. మే 8న జరగబోయే కడప, పులివెందుల ఉప ఎన్నికల్లో ప్రచార పర్వానికి బుధవారం తెరలేవనుంది. తమ కుటుంబాన్ని గెలిపించాలంటూ క్యాంపేయిన్‌ మొదలుపెట్టనున్నారు యువనేత జగన్‌. కడప పార్లమెంట్‌ పరిధిలోని కడప, పులివెందుల, జమ్మలమడుగు, మైదుకురు, బద్వేల్‌, కమలాపురం, ప్రొద్దుటూర్‌ నియోజకవర్గాల్లో జగన్‌ టూర్‌ ఖరారైంది. పులివెందులలో YS విజయమ్మపై YS వివేకానందరెడ్డి పోటీ చేయనుండడంతో జగన్ ఈ నియోజకవర్గంపై ఎక్కువ ఫోకస్‌ చేయనున్నారు. రేపటి నుంచి ఎన్నికల ప్రచారం గడువు ముగిసేంత వరకు ఆయన కడప జిల్లాలోనే మకాం వేయనున్నారు. ఈనెల 6, 15, 24 తేదీల్లో జమ్మలమడుగు నియోజకవర్గంలో.... పర్యటించనున్నారు. ఇక ఈనెల 8, 14, 17, 23, 30 తేదీలతోపాటు మే 2, 4 తేదీల్లో పులివెందుల కానిస్టెన్సీలో పర్యటించనున్నారు జగన్‌. ఏప్రిల్‌ 12, 22, 29 తేదీల్లో బద్వేల్‌ నియోజకవర్గంలో... ఈనెల 11, 21తోపాటు మే 5 తేదీల్లో కడప నియోజకవర్గంలో టూరేస్తారు యువనేత. ఇక ఇదేనెల 19, 27, మే 3 తేదీల్లో ప్రొద్దుటూర్‌ నియోజకవర్గంలో... ఏప్రిల్‌ 10, 20, 26 తేదీలతోపాటు మే 3వ తేదీల్లో మైదుకురు నియోజకవర్గాల్లో పర్యటిస్తారు YSR కాంగ్రెస్‌ అధినేత. జగన్ ప్రచారం కోసం ఇప్పటికే ప్రచార రథం సిద్ధమైంది. పార్టీ అధినేత టూర్‌ను విజయవంతం చేసేందుకు యువనేత వర్గం MLAలు ఆదినారాయణరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, కమలమ్మ, అమర్‌నాథ్‌రెడ్డి, శ్రీనివాసులు, MLC దేవగుడి నారాయణరెడ్డి, YSR కాంగ్రెస్‌ నాయకులు భూమా నాగిరెడ్డి, కడప మాజీ మేయర్‌ రవీంద్రనాథ్‌రెడ్డి జగన్‌ టూర్‌ కోసం కసరత్తు చేస్తున్నారు. 

చైతన్యశీలి డాక్టర్జీ ...


చైతన్యశీలి డాక్టర్జీ

సార్థకమైన జీవితానికి గీటురాయి ఎంత కాలం జీవించారు అనేది కాదు, ఆ వ్యక్తి తన జీవితంలో ఏమి సాధించాడు అనేది అవుతుంది. అట్లాగే ఏ మహాపురుషుడినైనా అర్థం చేసుకోవాలంటే ఆ మహాపురుషుడు జీవించి ఉన్న కాలంలోని సమకాలీన పరిస్థితులు, ఆ సమయంలో వారు సాదించిన విజయాలు, ఆలోచనలు, అన్నీ కలగలసి ఆ మహాపురుషుడిని అర్థం చేయిస్తాయి. భారతదేశ స్వాతంత్య్ర పోరాట సమయంలో అనేకమంది మహాపురుషులు జన్మించారు. వారిలో స్వామి వివేకానంద, అరవింద, బంకించంద్ర, డాక్టర్‌ హెడ్గేవార్‌లు హిందూ సమాజాన్ని చైతన్యవంతం చేయడంలో వారు చేయవలసిన పనులను ఒకరి తరువాత ఒకరు చేసుకుంటూ వెళ్ళారు.
వారిలో డా||హెడ్గేవార్‌ హిందూ సమాజాన్ని శక్తివంతం చేసేందుకు ప్రారంభించిన కార్యం క్రమంగా విస్తరిస్తూ ఈ రోజున ప్రపంచంలోనే స్వచ్ఛందంగా పనిచేసే ఏకైక అద్భుత వ్యవస్థగా నిలబడింది. సమాజంలోని అన్ని రంగాలలో తనదైన శైలిలో పనిచేస్తూ అందరి మనస్సులను గెలుస్తూ ముందుకు పోతున్నది. ఇంతటి మహత్తర కార్యరచనకు డాక్టర్జీకి ప్రేరణ ఇచ్చిన అంశం ఏమిటి? అని ఆలోచిస్తే ఒకే ఒక అంశం మనకు కనబడుతున్నది. అదే ''ఇది మన మాతృభూమి, మనం మన మాతృభూమి వైభవం కోసం పని చేయాలి. దానికోసం ప్రతిరోజూ ఒక గంట సమయమిచ్చి అందరం ఒకచోట కలవాలి. మనసు విప్పి మాట్లాడుకోవాలి. దేశం గురించి మనం కలిసి పనిచేయటం నేర్చుకోవాలి ఈ సరళమైన కార్యపద్ధతికి, ఆలోచనకు సమాజంలోని అన్నివైపుల నుండి స్వాగతం లభించింది. ప్రతి రోజు కనీసం గంట సమయం ఇవ్వాలనే ఆలోచన నుండి తమ జీవితాలలో సంపూర్ణ సమయాన్ని సమర్పణ చేసి పనిచేసే వ్యక్తులు వేలాదిమంది తయారైనారు. ఆ విధంగా సంపూర్ణ సమయం సమాజం కోసం సమర్పణ చేసి పనిచేసే కార్యకర్తలు ఈ రోజున మూడు వేలమందికి పైగా కనబడతారు. సంఘ కార్య పద్ధతిని వికసింప చేయ డంలో పూజనీయ డాక్టర్జీకి ఆ సమయంలో ఎదురైన సమస్యలు ఏ రకంగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లోరో మనం అర్థం చేసుకోవలసిన అవసరం ఉన్నది. అవి కాంగ్రెస్‌ వేదికగా స్వాతంత్య్రపోరాటం ఉధృతంగా నడుస్తున్న రోజులు. 1920వ సంవత్సరం తరువాత కాంగ్రెస్‌ స్వతంత్ర పోరాటం కోసం మూడు పర్యాయాలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిం చింది. మొదటి ఆందోళన 1920-21లో ప్రారంభై 1924 ఫిబ్రవరిలో గాందీజీ జైలు నుండి విడుదలవ
టంతో నిలిచిపోయింది. 1930-31లో ప్రారంభమైన రెండవ ఆందోళన 1934 మే నెలలో గాంధీజీ ఆందోళనను వెనుకకు తీసుకోవడంతో ఆగిపోయింది. మూడవ ఆందోళన 1941 అక్టోబర్‌ 17న వినోబా భావే వ్యక్తిగత సత్యాగ్రహంతో ప్రారంభమై 1942లో పూర్తి ఆందోళనగా రూపుదిద్దుకొంది. 1945 జూన్‌ 15వ తేదీన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యులను విడుదల చేయటంతో ఈ ఆందోళన ఆగి పోయింది.
మొదటి ఆందోళన సమయానికి సంఘ స్థాపన జరగలేదు. డాక్టర్జీ కాంగ్రెస్‌లో పనిచేస్తున్న రోజులవి. ఆ ఆందోళనలో డా|| హెడ్గేవార్‌ క్రియాశీలంగా పనిచేసిన సంగతి అందరికీ తెలుసు. 1930వ సంవత్స రంలో సత్యాగ్రహంలో పాల్గొనేందుకు డాక్టర్జీ నిర్ణయించుకున్నారు. ఆందోళనకు తాత్కాలిక మహత్య మెంత ఉన్నా అది ఒక నైమిత్తిక కార్యక్రమం మాత్రమే. ఈ నైమిత్తిక కార్యం పూర్తి కావాలి. కాని ఈ పనుల వల్ల సంఘ నిత్యకార్యానికి ఆటంకం కలగరాదు. ఈ సంతులనాన్ని పరిరక్షించాల్సి ఉంది. దానికి కావలసిన ఆలోచనలను డాక్టర్జీ చేశారు. కాబట్టి డాక్టర్జీ సత్యాగ్రహంలో పాల్గొనేముందు సరసంఘ చాలక్‌ బాధ్యత వేరేవారికి అప్పగించారు. సత్యాగ్రహానికి డాక్టర్జీ ఎంచుకున్న సమయం చూసినట్లైతే వాస్తవానికి సత్యాగ్రహం మార్చి మాసంలో ప్రారంభమైనా సంఘ శిక్షావర్గ పూర్తి అయిన తరువాత మాత్రమే డాక్టర్జీ సత్యాగ్రహంలో పాల్గొన్నారు. 1937వ సంవత్సరం వరకు డాక్టర్జీ సంఘకార్య పద్ధతి కాంగ్రెస్‌ కార్యక్రమాలకు మధ్య సంతులనం ఉంచడానికి ప్రయత్నం చేశారు. ఆ సంవత్సరం కాంగ్రెస్‌ సంకీర్ణ దశ స్వరూపాన్ని ధరించింది. ఆ సమయంలో డాక్టర్జీ ఇలా చెప్పాడు.
కాంగ్రెస్‌ జాతీయ స్వరూపాన్ని వీడనంతవరకు నేను దానిలో సభ్యునిగానే ఉన్నాను. కాంగ్రెస్‌ కేవలం ఒక పార్టీగా రూపాన్ని ధరించటం ప్రారంభించినప్పటి నుండి నేను దానిలో సభ్యుడిని కాను. మరోపక్క డాక్టర్జీ ప్రారంభం నుండి హిందూ మహాసభలో క్రియీశీలంగా ఉండేవారు. అందులో అనేక రకాల బాధ్యతలు నిర్వహించారు. హిందూ మహాసభ వారు డాక్టర్జీ ప్రారంభించిన సంఘం స్వయం సేవకులు తమ పనులన్నీ చేసిపెట్టాలి అని భావిస్తుండేవారు. నిత్య, అనిత్య వివేకంతో డాక్టర్జీ వ్యవహరించిన కారణంగా అన్ని రకాల ఉద్యమాల మధ్య సంఘకార్యం స్థిరంగా నిలబడింది. అంతిమ లక్ష్యం మీద దృష్టి ఉన్నా, తాత్కాలిక అంశాలను పట్టించుకోకుండా ఉండటం అవ్యవస్థిత మానసిక స్థితిగా డాక్టర్జీ భావించేవారు. అదే విధంగా తాత్కాలిక ఆవేశంతో కొట్టుకు పోవటం వల్ల అంతిమ లక్ష్యానికి దెబ్బ తగిలేటట్లయితే అది కూడా అవ్యవస్థిత మానసిక లక్షణంగానే భావించారు. అంతిమం తాత్కాలికం అయినా ఆవశ్యకతలో నిత్య కార్యాన్ని సంఘాను కూలంగా సంతులితంగా ఉండటం పరమ ఆవశ్యకం. ఈ సంతులనంలో వ్యక్తి నిరపేక్షతా, ధ్యేయనిష్ఠ స్పస్టంగా కనిపిస్తుంది. ఈ సంతుల నాన్ని డాక్టర్జీ ఎప్పుడూ కోల్పోలేదు. ఈ విషయాలను చాలామంది సరిగా అర్థం చేసుకోక పోవటం కారణంగా డాక్టర్జీ విషయంలో, సంఘం విషయంలో అసంతుష్టిగా ఉండేవారు. డాక్టర్జీ సంతులన స్థితికి లభించిన మూల్యం ఒకవైపు కాంగ్రెసీల అసంతుష్టి, మరొకవైపు హిందూ సోదరుల అసంతృప్తి రెండు వైపుల అసంతృష్టి వాయువులు వీస్తున్నా చింతించకుండా డాక్టర్జీ రాష్ట్ర నిర్మాణ కార్యంలో నిమగ్నమై పనిచేశారు.
దేశంలో పనిచేసే హిందూ సంస్థల ధోరణులను కూడా అర్థం చేసుకోవాలి. గడిచిన కొద్ది సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న సమస్యలు అర్థం చేసుకొని పరిస్థితులను అధిగమించేందుకు డాక్టర్జీ వ్యవహార కుశలతను అర్థం చేసుకొని ముందుకు సాగాలి.
,,, భారతి....

ఇతర సిబ్బందితోను హాస్పిటల్‌ని ఎందుకు నిర్వహిస్తున్నారు?


తరచుగా ఒక ప్రశ్న వేస్తుంటారు - అది, బాబావారు తామే అద్భుత రీతిలో రోగాలకు చికిత్స చేసి మాన్చుతున్నప్పుడు, పుట్టపర్తిలో డాక్టర్లతోను, ఇతర సిబ్బందితోను హాస్పిటల్‌ని ఎందుకు నిర్వహిస్తున్నారు? అని ఇలాంటి ప్రశ్నలను అడుగుతున్నవాళ్ళు ఆధ్యాత్మిక శాస్త్రాలనేకాక విజ్ఞాన శాస్త్రాలనుకూడా దృష్టిలో పెట్టుకొని విజ్ఞానాన్ని ఆర్జించుకోవాలి. రష్యాలో అధిమనో విజ్ఞాన శాస్త్రాన్ని (శసశూా-ఠుుగా) ఎంతగానో అభివృద్ధి పరుస్తున్నారు. అక్కడ అతిమానుషమయిన (కార్య కారణ సంబంధం లేకుండా దైవశక్తితో కూడిన) కొన్ని విషయాలమీద ఆకట్టుకొనే ప్రయోగాలను జరిపారు. వాటిని గురించి ఇటీవల అమెరికాలో ఒక తక్కువ వెల పుస్తకం ప్రచురింపబడింది. ప్రశాంతి నిలయంవంటి ఆశ్రమాలలోని డాక్టర్లు ఆధ్యాత్మిక నేపథ్యంతో వైద్య చికిత్సలు చేయాలి. డాక్టర్లు ఒక జబ్బును నిర్ధారించి దానికి చికిత్స ఎట్లా చేయాలో నిర్ణయించటానికి మందు ఆ జబ్బుమీద అంతర్‌ బుద్ధిని ప్రయోగించాలి. అప్పుడే ఆ జబ్బు వివరాలను, దానికి సంబంధించిన సూక్ష్మాంశాలను గుర్తించడంలో అతని విజ్ఞానశాస్త్రం సంపూర్ణంగా సహకరిస్తుంది. అనుగ్రహంయొక్క పరిధిలో విజ్ఞాన శాస్త్రాన్ని అభివృద్ధిపరచాలి.
డా|| సామ్యుయెల్‌ హెచ్‌. సాండ్‌వైస్‌, ఎం.డి., అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని కేలిఫోర్నియా రాష్ట్రంలోని సాన్‌డీగో విశ్వవిద్యాలయంలో మనోవిజ్ఞాన శాస్త్రంలో ప్రొఫెసరేకాక, మనో వైజ్ఞానిక (సైకియాట్రిస్ట్‌) డాక్టర్‌గా కూడా వృత్తిని నిర్వహిస్తున్న వాడు. ఆయన రాసిన 'సాయిబాబా, ది హోలీ మ్యాన్‌ అన్‌డ్‌ ది సైకియాట్రిస్ట్‌' అన్న గ్రంథం ఎంతో ఆకట్టుకొంటున్న గ్రంథం. మనో విజ్ఞాన మూలాల్ని తెలుపుతూ ఒక ఆకర్షకమైన కథనం అందులో ఉన్నది. మనో విజ్ఞాన శాస్త్రం అని చెప్పబడ్తున్న శాస్త్రం ఒక అసమగ్రమైన శాస్త్రమనీ, దాన్ని నిజంగా ప్రభావవంతం చేయాలంటే, ఆధ్యాత్మిక క్షేత్రం నుంచి ఎన్నో విషయాలను అందులో చేర్చాల్సి ఉంటుందని ఆయన నిశ్చితంగా చెప్పాడు. ఈ గ్రంథంలో డా|| సాండ్‌వైస్‌ తనకు బాబాతో కలిగిన అనుభవాలనుకూడా వివరించారు. మొట్టమొదట తను 'అనిశ్చితి', 'అనిర్ణయత' ఉన్నవాడిననీ, అధ్యాత్మక వెలుగులో తాను మారానన్నారు. తన నాస్తికపు సంశయాత్మక బుద్ధిని ఎంతమేరకు వెళ్ళగలదో అంతమేరకు వెళ్ళనిచ్చాననీ, ఐతే అట్లా సంశయించడంలో ఏమాత్రం నిజాయితీ ఉన్నప్పటికీ, అది ఆత్మయొక్క ఉనికినీ, ఆధ్యాత్మిక సత్యాన్నీ అంగీకరిస్తుందన్నారు. తన వృత్తిమీదకూడా తనకున్న దృష్టిలో మార్పు వచ్చిందంటారు, సాండ్‌వైస్‌.
మతపరమైన మనో విజ్ఞానాన్ని ప్రత్యక్షంగా ఒక పాశ్చాత్య మనోవిజ్ఞాన శాస్త్రవేత్తగా అధ్యయనం చేయటానికి ఆయన భారత దేశానికి వచ్చారు. చిత్‌శక్తి శాస్త్ర పునాదిమీద ఆధారపడి, మనోవిజ్ఞాన చికిత్సా విధాన శాస్త్రమే తన రోగ చికిత్సా పద్ధతిని మార్చుకోవాల్సి ఉంటుందన్న నిర్ణయానికి వచ్చి ఆయన తన దేశానికి వెళ్ళిపోయాడు.
నిపుణుల కమిటీ ఒకటి బాబావారి మిరకిల్స్‌ (అద్భుతాల)ను గురించి ప్రత్యక్షంగా అధ్యయనం చేయడంకోసం పుట్టపర్తికి వచ్చిందని నాల్గవ అధ్యాయనంలో రాశాను ('ది ఎడ్వెంట్‌ ఆఫ్‌ సత్యసాయి' -అన్న గ్రంథంలో) వారు అమెరికాలోని చెస్టర్‌ ఎఫ్‌. కార్ల్‌సన్‌ రీసెర్చి లేబొరేటరీకి చెందినవారు. ఇందులోని ఇద్దరు మనో విజ్ఞాన శాస్త్రంలో నిష్ణాతులు. ఊాతో పాటు ాఒ కి చెందిన అంశాలను అధ్యయనం చేయడానికే ఈ లేబొరేటరీ (ప్రయోగశాల)ని వ్యవస్థాపించారు. (ఊా మరియు ాఒ లు అతీంద్రియ జ్ఞానాన్ని శాస్త్రీయంగా పరిశోధించి తెలిపే శాస్త్రాంశాలు). ఇద్దరు శాస్త్రవేత్తలు - ఒకరు డాక్టర్‌ కార్లిస్‌ ఇసిస్‌. వీరు అమెరికన్‌ సొసైటీ ఫర్‌ సైకిక్‌ రీసెర్చికి డైరెక్టరు. మరొకరు ఎర్‌టెన్‌డుర్‌ హరాల్డ్‌సన్‌ - ఐస్‌ల్యాండ్‌ యూనివర్శిటీకి చెందినవారు. బాబాను అధ్యయనం చేశాక వీరిద్దరూ వైదుష్యంతో కూడిన కొన్ని అంశాలతోఒక పరిశోధన పత్రాన్ని 'శ్రీ సత్యసాయిబాబావారికి సంబంధించిన ఐదు దేహాంతర కేసులు' అన్నదాన్ని రాశారు. (వీటిని క్షఇఊ అంటారు. అంటే క్షషష ుౌ ఇుdా ఊూ|స|n-| అని అర్థం. దేహం నుంచి తాను బైటకు వెళ్ళి జరిపే పనులని అర్థం). వీరి ఈ అధ్యయనాన్ని గమనిస్తే వీరికి చురుకయిన, సంకుచితం కాని మనస్సే కాక, తాము అధ్యయనం చేయదలచుకొన్న ఆధ్యాత్మికమైన మిరకిల్స్‌ మీద గౌరవం ఉన్న విషయాన్నిచూడ గల్గుతాము. అలాంటి అనుభవాలవద్దకు అవి దొంగవనో, అబద్ధమనో (ముందే ఏర్పరచుకొన్న) నిర్ణయాలతో వీరు వెళ్ళలేదు. ఈ అసాధారణ విషయాలను తమ పత్రంలో వీళ్ళు చర్చిస్తున్నప్పుడు వీటిని తెలుపడానికి తగిన పరిభాషా శబ్దాలనుకూడా వీరు సిద్ధం చేసికొన్నారు. ఇది విశేషమయిన ప్రత్యేక శాస్త్రం. సాహిత్యాన్నో, సాంఘిక, భౌతిక విజ్ఞాన శాస్త్రాలనో అధ్యయనం చేస్తే ఈ జ్ఞానాన్ని పొందలేము. ఈ పరిశోధక పత్రంలో వీరు ఆధారపడిన గ్రంథ, వ్యాస సూచికల పట్టికను పరిశీలిస్తే, వీరికి అద్యతన అధిమనో విజ్ఞాన శాస్త్రంతోనూ (పేరాసైకాలజీ), భారతీ యులూ, అమెరికన్‌, ఆస్ట్రేలియన్‌ రచయితలూ బాబావారిని గురించి రాసిన రచనలతోనూ ఎంతటి గాడమైన విద్వత్తూ పరిచయమూ ఉన్నవో తెలస్తుంది. ాఒ పరిశోధనలకు ఆ శాస్త్రానికే పరిమితమైన సొంత పరిశోధన పద్ధతులున్నాయి. అధిమనో విజ్ఞాన శాస్త్ర అధ్యయనం లేకుండా, కనీసం ఆ పద్ధతులను గురించి దిఙ్మాత్ర పరిచయమైనా లేకుండా ఎవరయినా ఇలాంటి పరిశోధనలకు పూనుకుంటే, అది సాహసమే అవుతుంది.
తమ పత్రాన్ని గురించి ఈ ఇద్దరు శాస్త్రజ్ఞులు ఇట్లా అన్నారు ''ఇంటర్వ్యూలు ఇవ్వడానికి అంగీకరించి, తమ అనుచరులు ఈ (మా) పరిశోధనలో ఎలాంటి ఆటంకాలు లేకుండా సహకరించినందుకు శ్రీ సత్యసాయికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మా ఇంటర్వ్యూల నిర్వహణలో తోడ్పడిన సాక్షులకూ, ఇతరులకూ హృదయపూర్వకమయిన కృతజ్ఞతలు''.
ఈ పరిశోధన పత్రం నుంచి కొన్ని ఉదాహరణలు:
''కేవలం ప్రఖ్యాతులయిన వ్యక్తులూ, శాస్త్రజ్ఞులూ, పారిశ్రామికవేత్తలూ, రాజకీయనాయకుల కోసం కాకుండా, వీరి క్షఇఊ (దేహాంతర అనుభవం) పొందాల్సిన వ్యక్తికి కల్గిన ఆత్యయిక పరిస్థితి (జబ్బూ, నిస్పృహా మొదలైనవి) వల్లనే కలిగింది. కేవలం అవసరం వల్లనే బాబావారి క్షఇఊ (దేహాంతర అనుభవం) అగుపించినందువల్ల మా పరిశోధనల్లో వారిని పాల్గొనేటట్లు చేయడానికి మాకు అత్యల్ప అవకాశమే ఉన్నదని గ్రహించాము. ఐతే, వారు మాకోసంగాను అనేక సందర్భాలలో వస్తువులు అగుపించడం, మాయమవడం వంటివాటిని చూపించారు....''
ఈ నిపుణులు ఆకర్షకమైన కేసులను అన్వేషించే కార్యక్రమంలో, మూడుసార్లు భారతదేశానికి వచ్చి అనేక ఆశ్రమాలను చూశారు. 1973లో వారు చేసిన మూడవ పర్యటనలో వారికి బాబా విషయం తెలిసి వారిని జాగ్రత్తగా అధ్యయనం చేయాలనిపించినట్లుగా క్యాటరాక్ట్‌ ఆపరేషన్‌ అయిన ఒక వృద్ధురాలైన భక్తురాలికి బాబావారు ప్రత్యక్షం కావడాన్ని గురించి వీరీ పత్రంలో తెలిపారు: మద్రాసు సమీపంలో ఉన్న వెంకటగిరిలో ఉంటూనే శైలజ అన్న ఒక చిన్నపిల్ల ప్రార్థనవల్ల కాలికట్‌ సమాపంలోని మంజేరీలో శరీరంతో అగుపించి కొన్ని గంటలు భజన, సంభాషణ చేయడంగురించి ఇందులో వీళ్ళు తెలిపారు.
(వారి మాటల్లో ''మంజేరీ విషయంగా మేము బాబావారిని ప్రశ్నించాము. రెండు సందర్భాలలో 'తాను' దేహం విడిచి రావు కుటుంబంతో ఉన్నట్లుగా ధృవీకరించడం చాలా క్లుప్తంగా చేశారు.'')
ముగ్గురు దుబాసీల సహాయంతో వీళ్ళు 21 మంది సాక్షులను పరీక్షించినట్లుగా ఈ పత్రంలో పేర్కొన్నారు. ఏయే అంశాలను పరీక్షించాలో ఆరు పట్టికల్లో రాసికొన్నారు. ఈ నిపుణులు ఇంకా వివరిస్తూ -''దేశ దిమ్మరి సన్న్యాసులవలె సాయిబాబా భిక్షమడగరు. ఏమీ కోరరు. పోగా వారే ఇతరులకు సాయం చేస్తుంటారు'' అని తెలిపారు. బావిలో పడి మునిగిపోతున్న ఒక మనిషిని సాయమం దించేవాళ్ళు వచ్చేదాకా తానే సూక్ష్మ శరీరంతో ఎత్తి ఉంచిన కుప్పం సంఘటనను గురించి చర్చిస్తూ ఈ నిపుణులు ''ఇది క్షఇఊ అంశం. ఊా (ఊషసశ ా|nుసా |స-|ూషుn -అంతీంద్రియ గ్రమణం) కన్నా విశేషమైనది'' అని అంటూ ''బాబా తమని అవతారంగా భావించే - వారి అనుయాయులకు అనేకానేక ఊా శక్తులను ఖచ్చితంగా ప్రదర్శించారు. వారి ఊా శక్తిని మేము కూడా స్వయంగా చూశాము. ఊఐ కు (అతని స్వదేశమయిన) ఐస్‌ల్యాండ్‌లోని కొన్ని ప్రత్యేక సందర్భాలను సరిగ్గా పేర్కొన్నారు'' అని అన్నారు. ఆ విషయాన్ని గురించి వీళ్ళు ''బాబా చెప్పినవి క్షఇఊ లక్షణాలకు అనుగుణంగా ఉన్నాయి'' అని పేర్కొన్నారు.
తమ పరిశోధన పత్రం ముగింపుగా వీరు ''అరవై లక్షల భారతీయ భక్తులు శ్రీ సత్యసాయిబాబా ఒక విశేష లక్షణ వ్యక్తిగా, అవతారంగా భావించడం విషయంలో మనం దాని సంభావ్యతనుగురించి సానుకూల మనస్కతతో ఉండాలి. పోగా, ఈ కేసులు ఆయనను గురించి ప్రత్యేకంగా తెలియపరిచేవేగాని భారతీయ సంస్కృతినిగురించి తెలిపేవి కావు. వీరికి సంబంధించిన ఈ కేసులు పాశ్చాత్య దేశాల కేసుల కన్నాకూడా ఖచ్చితంగా విల క్షణమయినవి. అసా ధారణమైనవాటిని గురించి తెలిసికోవడానికి ఇవి ఎక్కువ వీలు కల్గిస్తున్నట్లుగా అగుపిస్తున్నది'' అని రాశారు. వీటన్నిటివల్ల శరీరంతోనూ, క్షఇఊ పద్ధతుల ద్వారానూ బాబావారు సామాన్య మానవునికి ఎట్లా సాయం చేస్తున్నారన్న విషయం పాఠకులకు తేటతెల్లమవుతుంది.
ాఒ శాస్త్రాన్ని (క్షఇఊ, ఊా మొదలైనవి) అధ్యయనం చేయాలని కోరుకొనే వ్యక్తులు ఇది అత్యంత నూతన విజ్ఞానశాస్త్రమనీ, ప్రపంచంలో ఎంతో అభివృద్ధి పొందిన దేశాల్లో దీనికి సంబంధించి పరిశోధించడానికి ప్రయోగశాలలూ, యూనివర్శిటీలూ స్థాపించారనీ గమనించాలి.పైన పేర్కొన్న పత్రం నుంచి అక్కడక్కడ ఉటంకించిన కొన్ని కొటేషన్లుకూడా ఈ విజ్ఞాన శాస్త్రం ప్రత్యేకమైందనీ, దీని పద్ధతులు వేరనీ, వీటిని అనుసరించి పరిశోధనలు జరిపినప్పుడే సత్యం ఆవిష్కారమవుతందనీ తెలుపుతాయి. ఏదో ఒక అంశంలోనైనా అనుభవాలను గురించిన ఈ ప్రయోగశాలల్లోకూడా తప్పులు జరుగవచ్చు. ఈ క్షేత్రంలో పని చేయడానికి భారతదేశంలో ఎందరికి శిక్షణ ఉన్నది? ఎందరు యోగ్యతా, అర్హతా సంపాదించుకొన్నారు? అన్నది సందేహాస్పదమే!

పుట్టపర్తిలో ....




సత్యసాయి ఆరోగ్యంపై సీఎం సమీక్ష
హైదరాబాద్ : సత్య సాయిబాబా ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మంగళవారం ఉదయం క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి మంత్రులు రఘువీరారెడ్డి, పితాని సత్యనారాయణ, సుదర్శన్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ హాజరు అయ్యారు.
అమ్మవారి విగ్రహానికి పునఃప్రతిష్ట
పుట్టపర్తి : పుట్టపర్తిలోని సత్తెమ్మ అమ్మవారి విగ్రహాన్ని పునఃప్రతిష్టించేందుకు బాబా భక్తులు,ప్రజలు సిద్ధం అయ్యారు. రెండు నెలల క్రితం సత్తెమ్మ అమ్మవారి విగ్రహం దెబ్బతినటంతో ఆ విగ్రహాన్ని చెరువులో నిమజ్జనం చేశారు. పుట్టపర్తి : పుట్టపర్తిలోని సత్తెమ్మ అమ్మవారి విగ్రహాన్ని పునఃప్రతిష్టించేందుకు బాబా భక్తులు,ప్రజలు సిద్ధం అయ్యారు. రెండు నెలల క్రితం సత్తెమ్మ అమ్మవారి విగ్రహం దెబ్బతినటంతో ఆ విగ్రహాన్ని చెరువులో నిమజ్జనం చేశారు. 
బాబా స్పృహలోనే ఉన్నారు: సఫాయా
పుట్టపర్తి : సత్యసాయి బాబా ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని వైద్యుడు సఫాయా తెలిపారు. ఆయన మంగళవారం ఉదయం బాబా ఆరోగ్యంపై తాజా బులిటెన్ విడుదల చేశారు. బాబా స్పృహలోనే ఉన్నారని, వెంటిలేషన్ ద్వారా శ్వాస అందిస్తున్నట్లు తెలిపారు. హార్ట్ బీట్, బీపీ నార్మల్‌గానే ఉన్నట్లు వెల్లడించారు.ఇన్పెక్షన్ సోకే అవకాశం ఉన్నందున ఐసీయూలోనికి ఎవరినీ అనుమతించటం లేదని సఫాయా పేర్కొన్నారు. నిరంతరం డయాలసిస్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కాగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ ఈరోజు మధ్యాహ్నాం పుట్టపర్తి రానున్నారు.
సత్యసాయిలో స్వల్ప చలనం
పుట్టపర్తి: సత్యసాయి బాబా కళ్లలో స్వల్ప చలనం కనిపించిందని ఆయన సమీప బంధువులు తెలిపారు. ఈ రోజు రాత్రి బాబా బంధువులు ఐసియులోనికి వెళ్లి ఆయనని పలకరించారు. దాంతో బాబాలో స్వల్పంగా చలనం కనిపించినట్లు వారు చెప్పారు. కాళ్లు కూడా కదిపినట్లు వారు తెలిపారు. భక్తులు ఆందోళన చెందవద్దని, ప్రశాంతంగా ఇళ్లకు వెళ్లమని వారు కోరారు.
'సత్తెమ్మ విగ్రహం తొలగింపుతో బాబాకు అరిష్టం'
పుట్టపర్తి: అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని సత్తెమ్మ అమ్మవారి విగ్రహం తొలగింపు వల్ల సత్యసాయి బాబాకు అరిష్టమని భక్తులు నమ్ముతున్నారు. కొద్ది రోజుల క్రితం సత్తెమ్మ విగ్రహాన్ని తొలగించి చెరువులో నిమజ్జనం చేశారు. అలా చేయడం వల్లే బాబాకు ఆరోగ్యం క్షీణించిందని భక్తులు నమ్ముతున్నారు. ఆ విగ్రహాన్ని తిరిగి ప్రతిష్టించేందుకు భక్తులు ప్రయత్నిస్తున్నారు. చెరువులో పాత విగ్రహం కోసం వారు వెతుకుతున్నారు.
పుట్టపర్తికి పోలీస్ బలగాల తరలింపు
పుట్టపర్తి: సత్యసాయి బాబా ఆరోగ్యం క్షీణించిందని తెలిసి భక్తులు ఆందోళన చెందుతున్నారు. బాబాని తమకు చూపించాలని వారు డిమండ్ చేస్తున్నారు. ప్రశాంతి నిలయం వద్ద ఉద్రిక్త వాతావరణ నెలకొంది. బాబా చికిత్స పొందుతున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వద్దకు అధిక సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. ఇక్కడికి వచ్చిన వాహనాలపై స్థానికులు రాళ్లు రువ్వారు. జిల్లా కలెక్టర్ జనార్ధన రెడ్డి వాహన్నాన్నికూడా అడ్డుకున్నారు. దాంతో ఆయన వెనుతిరిగి వెళ్లిపోయారు. జాయింట్ కలెక్టర్ అనిత, ఆర్టీఓలను అడ్డుకున్నారు. జర్నలిస్టులను కూడా వెళ్లిపొమ్మని చెప్పారు. దీంతో ముందు జాగ్రత్తగా చుట్టుపక్కల జిల్లాల నుంచి పోలీసు బలగాలను రప్పిస్తున్నారు. తిరుపతి నుంచి ప్రత్యేక బలగాలు తరలి వచ్చాయి.
బాబా త్వరగా కోలుకోవాలని చిరు ఆకాంక్ష
హైదరాబాద్: సత్యసాయిబాబా త్వరగా కోలుకోవాలని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి
సోమవారం ఆయన బాబా ఆరోగ్యం గురించి వాకబు చేశారు. సత్యసాయి ట్రస్టు వర్గాలతో ఫోన్లో మాట్లాడి
 ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Friday, April 1, 2011

కృష్ణా జిల్లా నేతల కుమ్ములాటపై నందమూరి హరికృష్ణ ఆగ్రహం


కృష్ణా జిల్లా నేతల కుమ్ములాటపై నందమూరి హరికృష్ణ ఆగ్రహం
హైదరాబాద్: పార్టీ కృష్ణా జిల్లా నాయకుల మధ్య కుమ్ములాటపై తెలుగుదేశం పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నేతల మధ్య నెలకొన్న విభేదాలు రచ్చకెక్కడంపై ఆయన మండిపడ్డారు. పార్టీలో సమన్వయంతో పని చేసి, అందరినీ కలుపుకుని పోవాలి తప్ప విభేదాలకు తావిచ్చేలా వ్యవహరించడం సరి కాదని ఆయన కృష్ణా జిల్లా నాయకులకు చెప్పినట్లు సమాచారం. హరికృష్ణ కృష్ణా జిల్లా పర్యటనపై జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని ఉమా మహేశ్వర రావుకు వ్యతిరేకంగా వల్లభనేని వంశీ విజయవాడ నగర పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడానికి సిద్ధపడిన విషయం తెలిసిందే. వంశీ, శాసనసభ్యుడు కొడాలి నాని తనపై విమర్శలు చేయడాన్ని నిరసిస్తూ దేవినేని ఉమా మహేశ్వర రావు జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. వంశీ, ఉమ పరస్పరం సవాళ్లు కూడా విసురుకున్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు స్ఫూర్తితో పనిచేస్తున్న తనపై విమర్సలు చేయడం సరి కాదని ఉమమహేశ్వర రావు అన్నారు. ఉమా మహేశ్వరరావుకు మద్దతుగా తెలుగు రైతు జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు రాజీనామా చేశారు. ఈ పరిణామాల పట్ల హరికృష్ణ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

పార్టీ పదవులకు దేవినేని, వంశీ రాజీనామాలు



పార్టీ పదవులకు దేవినేని, వంశీ రాజీనామాలు
విజయవాడ : కృష్ణాజిల్లాలో తెలుగు తమ్ముళ్ల విభేదాలు తారాస్థాయికి చేరాయి. తెలుగుతమ్ముళ్ల
 మద్య కుమ్ములాటలు పోటాపోటీ రాజీనామాలకు దారి తీశాయి. కృష్ణాజిల్లా టీడీపీ అధ్యక్ష పదవికి
 దేవినేని ఉమ శుక్రవారం రాజీనామా చేశారు. 
ఈ సందర్భంగా దేవినేని ఉమ మీడియాతో మాట్లాడుతూ తనపై వల్లభనేని వంశీ, నాని చేస్తున్న
 ఆరోపణలకు మనస్తాపం చెందే రాజీనామా చేసినట్లు తెలిపారు. నందమూరి హరికృష్ణ అంటే
 తనకు గౌరవం అని దేవినేని చెప్పారు. కార్యకర్తలతో చర్చించిన తర్వాత భవిష్యత్ కార్యాచరణను
 ప్రకటిస్తానని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు, ఎన్టీఆర్ స్ఫూర్తితో పనిచేస్తున్న తనపై
 ఆరోపణలు చేయటం సరికాదన్నారు.
ఇటు విజయవాడ నగర టీడీపీ అధ్యక్ష పదవికి వల్లభనేని వంశీ కూడా రాజీనామా
 చేశారు. ఆయన తన రాజీనామాను ఫ్యాక్స్ ద్వారా పార్టీ కార్యాలయానికి పంపించారు.
 ఈరోజు మధ్యాహ్నాం రెండు గంటలకు ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
 హరికృష్ణ పర్యటన సందర్భంగా దేవినేని ఉమ వైఖరికి నిరసనగా తాను రాజీనామా 
చేస్తున్నట్లు వంశీ చెప్పుకొచ్చారు. 

రాష్ట్ర జనాభా 8.46 కోట్లు


రాష్ట్ర జనాభా 8.46 కోట్లు


హైదరాబాద్ : జాతీయ స్థాయిలో చేపట్టిన జనాభా గణన ప్రకారం రాష్ట్ర జనాభా 8,46,65,533కి చేరింది. రాష్ట్రంలో జనాభా లెక్కల వివరాలను ఆ శాఖ రాష్ట్ర డైరెక్టర్ వై.వి. అనూరాధ తెలిపారు.మొత్తం జనాభాలో పురుషుల సంఖ్య 4,25,09,881 కాగా, మహిళల సంఖ్య 4,21,55,652. జనాభా వివరాలతో కూడిన బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సెన్సస్ ఆపరేషన్స్ జాయింట్ డైరెక్టర్ హనుమంతరాయ కూడా పాల్గొన్నారు.తాజాగా జరిపిన జన గణన సందర్భంగా ‘నపుంసకుల’ను కూడా గణించారు కానీ వీరిని పురుషుల జాబితాలోనే కలిపారు. వీరి సంఖ్యను తర్వాత వెల్లడిస్తామని అనూరాధ తెలిపారు. ప్రస్తుతం ఇవి ప్రాథమిక లెక్కలని, పూర్తిస్థాయి లెక్కలు వెల్లడించడానికి మరో ఏడాది సమయం పడుతుందని వివరించారు. 2001 జనాభా లెక్కల ప్రకారం మన రాష్ట్ర జనాభా 7,62,10,007 మాత్రమే. రాష్ట్రంలో జన గణన 2011 ఫిబ్రవరి 9న ప్రారంభించి ఫిబ్రవరి 28న ముగించారు. 2011 మార్చి ఒకటి నుండి ఐదు వరకు రివిజనల్ రౌండ్ లెక్కింపు జరిగింది. 2011 మార్చి 1 ప్రారంభం అయ్యే సమయానికి జన్మించిన ప్రతిశిశువును రెండో పర్యాయం జరిగిన రివిజనల్ రౌండ్ సందర్భంగా లెక్కల్లోకి తీసుకున్నారు. జనాభా గణనలో తొలుత 2010 ఏప్రిల్ 26 నుండి జూన్ 10 వరకు జరిగిన గణనలో ఇళ్ల వివరాలను సేకరించారు. దీని ఆధారంగా జనాభా గణన చేశారు.ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణం దృష్ట్యా దేశంలో నాలుగో స్థానంలో ఉండగా జనాభా పరంగా ఐదోస్థానంలో నిలిచింది. జనాభా అత్యధికంగా ఉన్న మొదటి నాలుగు రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్ నిలిచాయి. మన రాష్ట్రంలోని 23 జిల్లాల్లో అత్యధికంగా జనాభా ఉన్న జిల్లాగా రంగారెడ్డి (52,96,396) నిలిచింది. రెండో స్థానంలో తూర్పుగోదావరి (51,51,549), మూడో స్థానంలో గుంటూరు జిల్లా (48,89,230) నిలిచింది. అతి తక్కువ జనాభా ఉన్న జిల్లాగా విజయనగరం (23,42,868) నిలిచింది. మహిళల జనాభాలో కూడా రంగారెడ్డి మొదటి స్థానంలో నిలిచింది.ఈ జిల్లాలో మహిళల సంఖ్య 25,87,702కాగా అతితక్కువ మహిళల జనాభా ఉన్న జిల్లాగా విజయనగరం (11,80,955) నిలిచింది. ఒక చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో ఉండే జనాభాలో హైదరాబాద్ ప్రథమస్థానంలో (18,480), అతితక్కువగా ఉన్న జిల్లాగా ఆదిలాబాద్ (170) నిలిచాయ.అక్షరాస్యతలో హైదరాబాద్ ప్రథమస్థానంలో (80.96%) నిలవగా రెండో స్థానంలో రంగారెడ్డి (78.05%), మూడో స్థానంలో కృష్ణా జిల్లా (74.37%) నిలిచాయ. అతితక్కువ అక్షరాస్యత ఉన్న జిల్లాగా మహబూబ్‌నగర్ (56.06%), ఆ తర్వాతి స్థానంలో విజయనగరం (59.49%) నిలిచాయ. మహిళల విషయం పరిశీలిస్తే మహిళల్లో అక్షరాస్యత అత్యధికంగా ఉన్న జిల్లాగా హైదరాబాద్ (78.42%), అతితక్కువ ఉన్న జిల్లాగా మహబూబ్‌నగర్ (45.65%) నమోదయ్యాయ.(చిత్రం) గురువారం హైదరాబాద్‌లో విలేఖరుల సమావేశంలో జనగణన వివరాలు వెల్లడిస్తున్న జనగణన శాఖ రాష్ట్ర డైరెక్టర్ వై.వి. అనూరాధ. చిత్రంలో సెన్సస్ ఆపరేషన్స్ జాయింట్ డైరెక్టర్ హనుమంతరాయ ఉన్నారు.
=======================================================
రాష్ట్రంలో అధిక జనాభా కలిగిన పది జిల్లాలు
జిల్లా జనాభా
రంగారెడ్డి 5296396
తూర్పు గోదావరి 5151549
గుంటూరు 4889230
కృష్ణా 4529009
విశాఖపట్నం 4288113
చిత్తూరు 4170468
అనంతపురం 4083315
కర్నూలు 4046601
మహబూబ్‌నగర్ 4042191
హైదరాబాద్ 4010238
============================================