Wednesday, March 28, 2012

ఉప ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆసక్తి తగ్గిపోతోంది : బాబు


 ప ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆసక్తి నానాటికీ తగ్గిపోతుందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. కానీ.. రాష్ట్రం కొన్ని దుష్టశక్తుల చేతుల్లోకి వెళ్లకుండా కాపాడేందుకే తమ పార్టీ పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ముఖ్యంగా.. ఒక ప్రతిపక్ష పార్టీగా ఇన్ని ఉప ఎన్నికలను ఎదుర్కోవడం చాలా కష్టంగా ఉందన్నారు. 
ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో రాజకీయంగా అనిశ్చితి నెలకొందన్నారు. 2009 తర్వాత ఉప ఎన్నికల మీద ఎన్నికలు వచ్చాయని అన్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆసక్తి క్రమేణా తగ్గిపోతోంది. ఒక దశలో తమిళనాడులో తరహాలో ఉప ఎన్నికల్లో పోటీకీ దిగకూడదని అనిపిస్తోందన్నారు. కానీ, విధిలేని పరిస్థితుల్లో పోటీ చేయాల్సి వస్తోందన్నారు. 
ఎమ్మార్ కేసు, వైఎస్.జగన్మోహన్ రెడ్డి కేసుల్లో మంత్రులను సీబీఐ పిలిపించి విచారిస్తోందన్నారు. ఆనాడు ఎమ్మార్ కేసులో అప్పటి సీఎం వైఎస్‌కు బొత్స రాసిన లెటర్ ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ ఆవిర్భవించి మార్చి 29 నాటికి 30 సంవత్సరాలు పూర్తి చేసుకొని 31వ సంవత్సరంలోకి అడుగు పెడుతుందని, పార్టీ నాయకులు కార్యకర్తలు ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా నిర్వహించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.



No comments:

Post a Comment