Sunday, March 25, 2012

వుడా స్థలాల కేటాయింపులో భారీ కుంభకోణం వాస్తవమే


* తన కుమార్తెకు తక్కువ ధరకే స్థలం కేటాయింపు అవాస్తవమన్న మంత్రి 

* కుంభకోణంపై విజిలెన్స్‌-ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణకు ఆదేశం 

* అనర్హులపై క్రిమినల్‌ చర్యలు తప్పవు 

 తన కుమార్తెపై ఆరోపణలు నిజమైతే విచారణకు సిద్దం-మంత్రి మహిధర్ రెడ్డి 

తన కుమార్తెకు తక్కువ ధరకే భూమిని కేటాయించారన్న ఆరోపణల్లో వాస్తవం లేదని.. మున్సిపల్ శాఖ మంత్రి మహిధర్‌ రెడ్డి పేర్కొన్నారు. విజిలెన్స్‌-ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణలో ఆరోపణలు నిజమైతే.. తన కుటుంబం అంతా విచారణకు సిద్దపడుతుందన్నారురు. 

ఇక, విశాఖ-వుడా పరిధిలోని ఇళ్ల కేటాయింపులో భారీ కుంభకోణం వాస్తవమేనన్న మంత్రి.. అనర్హులపై క్రిమినల్‌ చర్యలు తప్పవని హెచ్చరించారు. మువ్వలవానిపాలెం అక్రమాలకు బాధ్యలైన అధికార్లను బదిలి చేశామన్న మహిధర్‌ రెడ్డి, కుంభకోణంపై సమగ్ర విచారణకు ఆదేశించామని తెలిపారు.

No comments:

Post a Comment