కాంగ్రెసు శాసనసభ్యుడు చిరంజీవి సిద్ధపడుతున్నారు. చిరంజీవి ప్రచార కార్యక్రమాన్ని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) రేపు శనివారం ఖరారు చేయనుంది. పార్టీ సూచిస్తే తాను ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని చిరంజీవి శుక్రవారం చెప్పారు. దీంతో చిరంజీవిని ఉప ఎన్నికల ప్రచార రంగంలోకి దింపడానికి పార్టీ నాయకత్వం కార్యక్రమాన్ని ఖరారు చేస్తోంది. ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్తారు.
చిరంజీవి కోవూరులోనే కాకుండా తెలంగాణ నియోజకవర్గాల్లో కూడా ప్రచారం చేయడానికి సుముఖంగానే ఉన్నట్లు చెబుతున్నారు. సమైక్యాంధ్ర నినాదం పుచ్చుకుని సీమాంధ్రలో పర్యటించిన తర్వాత చిరంజీవి తెలంగాణలో పర్యటించలేదు. ఒక రకంగా చెప్పాలంటే, చిరంజీవి తెలంగాణలో అడుగు పెట్టడానికి జంకినట్లే కనిపించారు. ఇప్పుడు కాంగ్రెసు కార్యకర్తల అండదండలతో, అభిమానుల తోడుతో ఆయన తెలంగాణలో పర్యటించడానికి సిద్ధపడుతున్నట్లు చెబుతున్నారు.
No comments:
Post a Comment