Wednesday, March 14, 2012

రైల్వే బడ్జెట్ ముఖ్య అంశాలు



* పదేళ్ల తర్వాత పెరిగిన రైలు ఛార్జీలు
* లోక్లాస్ నుంచి హైక్లాస్ వరకు బాదుడు
* ప్యాసింజర్ రైళ్లలో కూడా పెరిగిన ఛార్జీలు
* ప్యాసింజర్ లో కిలోమీటరుకు 2 పైసలు పెంపు 
* సబ్బరన్ లోకల్ ట్రైన్లలో కిలోమీటరకు 2 పైసలు పెంపు
* ఎక్స్‌ప్రెస్‌ సెకండ్‌ క్లాస్‌లో కిలోమీటరకు 3 పైసలు పెంపు
* స్లీపర్ క్లాస్ లో కిలోమీటరుకు 5 పైసలు పెంపు 
* ఎసీ త్రీ టైర్ లో కిలోమీటరుకు 10 పైసలు పెంపు
* ఎసీ ఛైర్ కార్‌లో కిలోమీటరుకు 15 పైసలు పెంపు 
* ఫస్ట్‌ క్లాస్‌ ఏసీలో కిలోమీటరకు 30 పైసల పెంపు
* 300 కిలోమీటర్లు ప్రయాణిస్తే రూ.12 అదనపు భారం 
* ప్లాట్ ఫాం టిక్కెట్ రూ.౩ నుంచి 5 రూపాయలు పెంపు

రైల్వే బడ్జెట్ లో ఛార్జీల మోత మోగింది.. బెంగాల్ ఎన్నికలు పూర్తి కావడం.. అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కూడా రావడంతో యుపీఏ ప్రజలకు ఛార్జీల వాతలు పెట్టింది.. లో క్లాస్ నుంచి హై క్లాస్ వరకు అందరిని ఓ బాదుడు బాదింది.. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లాలంటే ఇప్పుడు ఉన్న ఛార్జీకి అదనంగా పది రూపాయలు ఎక్కువ చెల్లించాల్సిందే.. అసలు రైల్వే బడ్జెట్ లో పెరిగిన ఛార్జీలు ఒక్కసారి పరిశీలిస్తే..

ఇది కామన్ మ్యాన్ బడ్జెట్ అంటూనే దినేష్ త్రివేది ఛార్జీల పెంపులో కామన్ మ్యాన్ కు ఏ మాత్రం మినహాయింపు ఇవ్వలేదు.. కేటగిరిలను బట్టి ఛార్జీల పెంచేశారు. ప్రతి కిలోమీటరుకు రెండు నుంచి ముఫై పైసల వరకు రైల్వే ఛార్జీల భారం ప్రయాణికులపై పడనుంది. తాజాగా పెంచిన రైలు ఛార్జీల వివరాలిలా ఉన్నాయి. ప్యాసింజర్ ట్రైన్ టిక్కెట్ కిలోమీటరు రెండు పైసలు పెరిగింది. 

ఎక్స్‌ప్రెస్‌లలో సెకండ్‌ క్లాస్‌ లో కి.మీకి మూడు పైసలు, అదే ఎక్స్ ప్రెస్ స్లీపర్ క్లాస్ లో ఐదు పైసలు, ఎసీ త్రీటైర్ లో 10 పైసలు, ఎసీ ఛైర్ కార్ లో కిలోమీటరు కు పది హేను పైసలు పెరిగింది. ఫస్ట్‌క్లాస్‌ ఏసీలో కిలోమీటరకు 30 పైసలు పెంచారు. దీనిని బట్టి 300 కిలోమీటర్లు ప్రయాణిస్తే 12 రూపాయలు అదనపు భారం పడింది. చివరకు ప్లాట్ ఫాం మీదకు వచ్చే వారిని కూడా రైల్వే మంత్రి వదలలేదు.. ప్లాట్ ఫాం టిక్కట్ ౩ నుంచి 5 రూపాయలు పెంచి షాక్ ఇచ్చింది. 


రైల్వే బడ్జెట్ లో రాష్ట్రానికి కాస్త ప్రాధాన్యం

రైల్వే బడ్జెట్‌లో గతంలో కంటే ఈదఫా రాష్ట్రానికి కాస్త ప్రాధాన్యత లభించింది. హైదరాబాద్‌లో ఎంఎంటిఎస్‌ రెండో దశకు రైల్వేమంత్రి దినేష్‌ త్రివేది గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. గత బడ్జెట్‌లో కేటాయించిన నిధులను విడుదల చేస్తామని చెప్పారు. మెదక్‌- అక్కన్నపేట్‌ల మధ్య, కొవ్వూరు-భద్రాచలం, కాకినాడ-పిఠాపురంల మధ్య ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేస్తామన్నారు. 

విశాఖ-కాకినాడల మధ్య కోస్టల్‌ కారిడార్‌ అభివృద్ధికి పెద్ద పీట వేస్తామని ప్రకటించారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్ల ఆధునీకరణతో పాటు ఎయిర్‌పోర్టుల స్థాయిలో మార్పు చేస్తామన్నారు. 

No comments:

Post a Comment