కేంద్ర మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్‌లో ఘనంగా జరిగింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి కేంద్ర సహాయమంత్రిగా ప్రమాణ స్వీ
కారం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, రాజ్‌నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, వెంకయ్య నాయుడు, మేనకా గాంధీ, రాంవిలాస్ పాశ్వాన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సుజనా మాట్లాడుతూ..డీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఆశయాలు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కృషి చేస్తానని సుజనా చౌదరి తెలిపారు. కేంద్ర మంత్రి వర్గంలో చోటు దక్కిన ఆయన ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన తేనేటి విందులో పాల్గొన్నారు.ఈ సందర్భంగా చౌదరి మాట్లాడుతూ దేశం, ప్రభుత్వం, రాష్ట్రం గురించి అన్ని విషయాలు మోదీ చెప్పారని, అందరూ కలిసి మెలసి చక్కగా పనిచేయాలని చెప్పారని అన్నారు.
No comments:
Post a Comment