ప్రధాని నరేంద్ర మోదీ మరో 21 మందిని కొత్తగా తన మంత్రివర్గంలో చేర్చుకున్నారు. పేరుకు ఎన్‌డీఏ మంత్రివర్గ విస్తరణ అయినా, వీరిలో 20 మంది బీజేపీ వారే కావడంతో మోదీ మార్కు స్పష్టంగా కనబడింది. తన డిమాండ్లతో మెట్టు దిగకుండా వ్యవహరిస్తున్న శివసేన నుంచి సరేశ్ ప్రభును రాజీనామా చేయించి, బీజేపీ తీర్థం ఇచ్చి మరీ మంత్రి పదవి ఇవ్వడంతో.. మంత్రివర్గంపై తన పట్టు కోసం మోదీ ఎంతగా పట్టుదలగా ఉన్నారో తెలిసిపోయింది. అలాగే మోదీతో వ్యవహారం ఎలా ఉంటుందో మిత్రపక్షాలకు తెలిసి వచ్చింది. తాజా విస్తరణతో మోదీ మంత్రివర్గ సభ్యుల సంఖ్య 66కు పెరిగింది.
గత శాఖలు మార్పు లేదు...
హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ, పట్టణ పేదరిక నిర్మూలన, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు, పౌర విమాన యాన శాఖమంత్రి అశోక్ గజపతిరాజు, వాణిజ్యం, పరిశ్రమల మంత్రి నిర్మలా సీతారామన్, మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీ, జలవనరుల మంత్రి ఉమాభారతి, విద్యుత్, బొగ్గు, పునరుత్పాదక ఇంధన మంత్రి పీయూష్ గోయల్, పెట్రోలియం సహజవాయు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, తదితరుల శాఖల్లో మార్పులేదు. అదేవిధంగా కేబినెట్ హోదా మంత్రుల్లో నజ్మాహెప్తుల్లా, రాంవిలాస్ పాశ్వాన్, కల్‌రాజ్ మిశ్రా, మేనకాగాంధీ, రవిశంకర్ ప్రసాద్, అనంతగీతె, హర్‌సిమ్రాత్ కౌర్ బాదల్, జ్యుయల్ ఓరమ్, రాధామోహన్ సింగ్, తవర్‌చంద్ గెహ్లాట్ శాఖల్లో కూడా పెద్దగా మార్పు లేదు.
కేబినెట్ మంత్రులు
నరేంద్ర మోదీ ప్రధానమంత్రి (పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సులు, పింఛన్లు, అంతరిక్షం, అణుశక్తి శాఖ మరియు
ఎవరికీ కేటాయించని శాఖలు.)
రాజ్‌నాథ్ సింగ్ హోం
మనోహర్ పర్రీకర్ రక్షణ
అరుణ్ జైట్లీ ఆర్థిక శాఖ, కంపెనీ వ్యవహారాలు,
సమాచార, ప్రసారశాఖ
సుష్మా స్వరాజ్ విదేశీ వ్యవహారాలు, ప్రవాసభారతీయ వ్యవహరాలు
నితిన్ గడ్కరీ షిప్పింగ్, రోడ్డు రవాణా,
జాతీయ రహదారులు
వెంకయ్యనాయుడు పట్టణాభివృద్ధి, గృహనిర్మాణం,
పట్టణ దారిద్య్ర నిర్మూలన
సురేష్ ప్రభు రైల్వే శాఖ
డి.వి.సదానంద గౌడ న్యాయశాఖ
రాంవిలాస్ పాశ్వాన్ ఆహారం, ప్రజాపంపిణీ, కన్య్జూమర్ అఫైర్లు
జె.పి.నడ్డా ఆరోగ్య, కుటుంబ సంక్షేమం
చౌదరి బీరేందర్ సింగ్ గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్,
తాగు నీరు, పారిశుధ్యం
కల్‌రాజ్ మిశ్రా మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్
మేనకా గాంధీ మహిళా శిశు సంక్షేమం
అనంతకుమార్ రసాయనాలు, ఎరువులు
రవిశంకర్ ప్రసాద్ కమ్యూనికేషన్, ఐటీ
అశోక్ గజపతి రాజు పౌర విమానయానం
అనంత్ గీతే భారీ పరిశ్రమలు, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్
హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండసీ్ట్ర
నరేంద్ర సింగ్ తోమర్ గనులు, ఉక్కు
జ్యుయల్ ఓరమ్ గిరిజన వ్యవహారాలు
తవర్‌చంద్ గెహ్లాట్ సామాజిక న్యాయం, సాధికారత
స్మృతి ఇరానీ మానవ వనరులు
ఉమాభారతి జల వనరులు, నదుల అభివృద్ధి, గంగా ప్రక్షాళన
నజ్మా హెప్తుల్లా మైనారిటీ వ్యవహారాలు
రాధా మోహన్ వ్యవసాయం
హర్షవర్ధన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్
సహాయ మంత్రులు (స్వతంత్ర ప్రతిపత్తి)
వి.కె.సింగ్ గణాంకాలు, పథకాల అమలు,
విదేశాంగ, ప్రవాస భారతీయ వ్యవహారాలు
సంతోష్ గంగ్వార్ జౌళిశాఖ
శ్రీపాద నాయక్ ఆయుష్, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం
ధర్మేంద్ర ప్రధాన్ పెట్రోలియం, సహజ వాయువులు
శర్వానంద్ సోన్వాల్ యువజన వ్యవహారాలు, క్రీడలు.
ప్రకాశ్ జవదేకర్ పర్యావరణం, అడవులు
పీయూష్ గోయల్ విద్యుత్తు, బొగ్గు, కొత్త, సంప్రదాయేతర ఇంధన వనరులు
జితేంద్ర సింగ్ పీఎంవో, సిబ్బంది శిక్షణ వ్యవహారాలు, శాస్త్ర
సాంకేతికత, ఎర్త్ సైన్స్. అంతరిక్షం,
అణు శక్తి శాఖల సహాయ మంత్రి.
నిర్మలా సీతారామన్ వాణిజ్యం, పరిశ్రమలు.
రావ్‌ఇందర్‌జిత్ సింగ్ ప్రణాళిక, రక్షణ శాఖ
రాజీవ్ ప్రతాప్ రూడి నైపుణ్య అభివృద్ధి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్,
పార్లమెంటరీ వ్యవహారాలు
బండారు దత్తాత్రేయ కార్మిక, ఉపాధి
మహేశ్ శర్మ సాంస్కృతిక, పర్యాటక శాఖలు, పౌర విమానయానం
సహాయ మంత్రులు
జి.ఎం.సిద్ధేశ్వర భారీ పరిశ్రమలు, ప్రభుత్వరంగ సంస్థలు
మనోజ్ సిన్హా రైల్వేలు
ఉపేంద్ర కుష్వాహా మానవ వనరుల అభివృద్ధి
పొన్ రాధాకృష్ణన్ షిప్పింగ్, రోడ్డు రవాణా,
జాతీయ రహదారులు
కిరన్ రిజిజు హోం
క్రిషన్ పాల్ గుజ్జర్ సామాజిక న్యాయం, సాఽధికారత
సంజీవ్ బల్యాన్ వ్యవసాయం
మన్‌సుఖ్‌భాయ్ వసావా గిరిజన వ్యవహారాలు
రావ్‌సాహెబ్ దాదారావు ధాన్వే ఆహారం, ప్రజా పంపిణీ, కన్య్జూమర్ అఫైర్లు
విష్ణుదేవ్ సాయి గనులు, ఉక్కు
సుదర్శన్ భగత్ గ్రామీణాభివృద్ధి
నిహాల్‌చంద్ పంచాయతీరాజ్
ముక్తార్ అబ్బాస్ న క్వీ మైనారిటీ, పార్లమెంటరీ వ్యవహారాలు
రాంకృపాల్ యాదవ్ తాగునీరు, పారిశుధ్యం
హరిభాయ్ పార్థీభాయ్ చౌదరి హోం శాఖ
సంవర్‌లాల్ జాట్ జల వనరులు, నదుల అభివృద్ధి, గంగానది శుద్ధి
మోహన్‌లాల్ కుందారియా వ్యవసాయం
గిరిరాజ్ సింగ్ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు
హన్సరాజ్ అహిర్ రసాయనాలు, ఎరువులు
రాంశంకర్ కఠీరియా మానవ వనరుల అభివృద్ధి
సుజనా చౌదరి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్
రాజ్యవర్ధన్ రాఠోర్ సమాచార, ప్రసారాల శాఖ
బాబూలాల్ సుప్రియో పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణం,
పట్టణ దారిద్య్ర నిర్మూలన,
జయంత్ సిన్హా ఆర్థిక శాఖ
సాధ్వి నిరంజన్ జ్యోతి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండసీ్ట్రస్
విజయ్ సాంప్లా సామాజిక న్యాయం, సాఽధికారిత
No comments:
Post a Comment