విశాఖపట్నం,(సక్సెస్ న్యూస్) జీవీఎంసీ కమిషనర్‌గా కోన శశిధర్ నియామకం దాదాపు ఖరారైనట్టే..?గతంలో వుడా వీసీగా పనిచేసిన అనుభవం ఉన్న శశిధర్ ప్రస్తుతం కడపజిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. సుమారు రెండు నెలలుగా జీవీఎంసీకి పూర్తిస్థాయి కమిషనర్ లేక
పోవడంతో పాలన కాస్తా కుంటుపడింది,. ఇన్‌చార్జి కమిషనర్‌గా ప్రస్తుతం జానకి ఉన్నప్పటికీ, కమిషనర్ లేని లోటు కనిపిస్తోంది. స్మార్ట్‌సిటీగా విశాఖను తీర్చిదిద్దడానికి మాంచి కమిషనర్‌ని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. వుడా వీసీగా పనిచేసిన సమయంలో కోన శశిధర్ పలు కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు పాలనలో దక్షత చూపించారనక తప్పదు.దీంతో మహావిశాఖనగరపాలక సంస్థకు కమిషనర్‌గా నియమిస్తే, విశాఖనగరం వేగంగా అభివృద్ధికి సాధ్యపడుతుందని ప్రభుత్వం భావించి, కోన శశిధర్ పేరును పరిశీలిస్తున్నట్లు తెలిస్తుంది. గ్రేటర్ ఎన్నికలు కూడా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీంతో వెంటనే కమిషనర్ నియామకం చేపట్టాలని మన ప్రభుత్వం భావిస్తోంది. త్వరలోనే కమిషనర్ నియామకం జరుగుతుందని సెక్రటరియేట్ వర్గాలు చెబుతున్నాయి.
No comments:
Post a Comment