జిల్లా కాంగ్రెస్ పగ్గాలు మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి దక్కాయి. ప్రస్తుత ఇన్‌చార్జి డీసీసీ అధ్యక్షుడు తోట నగేష్‌ను ఆ పదవి నుంచి తప్పించారు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని జిల్లాల అధ్యక్షులను మారుస్తూ పీసీసీ నిర్ణయం తీసుకుంది. ఆ జాబితాలో విశాఖ జిల్లా కూడా వుంది. నగేష్ స్థానంలో అదే సామాజికవర్గానికి చెందిన చోడవరం మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి కరణం ధర్మశ్రీని నియమించారు. ధర్మశ్రీ 2004లో మాడుగుల నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికై 2009 వరకూ కొనసాగారు. 2009లో చోడవరం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి అక్కడి టీడీపీ అభ్యర్థి కె.ఎస్.ఎన్.రాజు చేతిలో ఓటమి పాలయ్యారు. మరోవైపు నగర కాంగ్రెస్ అధ్యక్షునిగా విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్‌ను యధావిధిగా కొనసాగిస్తున్నారు.
No comments:
Post a Comment