Wednesday, November 21, 2012

ముంబై పేలుళ్ల ఘటనలో నిందితుడైన కసబ్‌కు ఉరిశిక్ష అమలు


కసబ్ ఉరిశిక్షను ధృవీకరించిన మహారాష్ట్ర హోంశాఖ

ముంబై పేలుళ్ల కీలక సూత్రధారి మహ్మద్ అజ్మల్ అమీర్ కసబ్ ను బుధవారం ఉదయం పూణే సమీపంలోని ఎర్రవాడ జైలులో ఉరి తీశారు. క్షమాభిక్ష పిటిషన్ ను భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరస్కరించడంతో కసబ్ కు ఉరిశిక్షను అమలు చేశారు. కసబ్ ఉరిశిక్షను మహారాష్ట్ర హోంశాఖ అధికారులు ధృవీకరించారు. ముంబైలోని ఆర్థర్ రోడ్ నుంచి ఈ ఉదయం రహస్యంగా పూణేలోని ఎర్రవాడ జైలుకు తరలించారు.
2008 నవంబర్ 26 తేదిన ముంబైలో మారణహోమం సృష్టించిన సంఘటనలో కసబ్ కీలక సూత్రధారి. ముంబై పేలుళ్ల తర్వాత కసబ్ పట్టుబడ్డారు. ఈ ఘటనలో వందలాది మంది మృతికి కారణమయ్యారు. భారత్ లో కల్లోలం సృష్టించడానికి పాకిస్థాన్ పన్నిన కుట్ర.. కసబ్ దొరకడం వల్లనే బట్టబయలైంది. 
* 26/11 దాడుల్లో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. 
* ముంబైపైలో మారణహోమంలో పాకిస్థాన్ కు చెందిన 10 మంది ఉగ్రవాదులు పాల్గొన్నారు. 
* 2008 లో పట్టుబడిన లష్కరే తోయిబాకు చెందిన కసబ్ ను ముంబైలని ఆర్థర్ రోడ్ జైలులోని బుల్లెట్ ఫ్రూఫ్ జైలు గదిలో ఉంచారు. 
* ఫిబ్రవరి 21 తేదిన బాంబే హైకోర్టు కసబ్ కు ఉరిశిక్ష విధించింది
* కసబ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ ను నవంబర్ 5 తేదిన ప్రణబ్ ముఖర్జీ తిరస్కరించారు.



No comments:

Post a Comment