Friday, November 2, 2012

ఎర్రన్నాయుడు మృతి టీడీపీకి తీరనిలోటు


ఎర్రన్నాయుడు మృతి టీడీపీకి తీరనిలోటు

ర్రన్నాయుడు మృతి తెలుగు దేశం పార్టీకి తీరని లోటు అని ఆపార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అన్నారు. ఎర్రన్నాయుడు మరణ వార్త విన్న ఆయన తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. ఎర్రన్నాయుడును కోల్పోవటం తన కుడి భుజాన్ని కోల్పోయినట్లు అయిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మంచి మిత్రుడు, సహచరుడుని కోల్పోయామన్నారు. 

ఆయన లేరనే దుర్వార్త వినటం చాలా దురదృష్టకరమన్నారు. రాజకీయ ఎంత ఉన్నత పదవులు ఉన్నా అణిగి ఉండే వ్యక్తి అని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఎర్రన్నాయుడు మృతి పట్ల ఆయన కుటుంబానికి చంద్రబాబు ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రజల కోసం అంకిత భావంతో పని చేసిన వ్యక్తి ఎర్రన్నాయుడు అని, పార్టీకి ఏకష్టం వచ్చినా అండగా నిలిచారన్నారు.

ఎర్రన్నాయుడుకు నివాళులు అర్పించేందుకు చంద్రబాబునాయుడు తన పాదయాత్రను రద్దు చేసుకున్నారు. బుధవారం ఉదయం ఆయన మహబూబ్ నగర్ జిల్లా పెద్దచింతకుంట నుంచి హైదరాబాద్ బయల్దేరారు. అక్కడ నుంచి విమానంలో శ్రీకాకుళం వెళ్లనున్నారు. 

No comments:

Post a Comment