Sunday, June 24, 2012

విశ్వబ్రహ్మాణుల సంక్షేమంలో ప్రభుత్వం విఫలం !!?



నర్సీపట్నం;(సక్సెస్ న్యూస్) : రాష్ట్రంలో విశ్వబ్రహ్మణుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని జిల్లా విశ్వబ్రహ్మణ సహకార సంఘం డైరెక్టర్ పెదపాటి గోవింద్ అన్నారు. రాష్ట్రంలో గల సుమారు 85 లక్షల మంది విశ్వబ్రహ్మణులను మోసగిస్తున్న ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఆదివారం రాష్ట్ర రాజధానిలోని ఇందిరా పార్కు వద్ద సంఘం కార్యదర్శి బి.నర్సింహం ఆధ్వర్యంలో రిలేనిరసన ప్రారంభం కానున్నది. ఈ ఆందోళనలో పాల్గొనేందుకు విశాఖ జిల్లా నుంచి సుమారు వెయ్యి మంది విశ్వబ్రహ్నణులు శనివారం హైదరాబాదు బయలు దేవి వెళ్ళారని ఆయన తెలిపారు. దివంగత ముఖ్య మంత్రి రాజశేఖర్‌రెడ్డి విశ్వబ్రహ్మణుల సంక్షేమానికి రూ.100 కోట్లు మంజూరు చేశారని అన్నారు. ఆ తర్వాత అధికారం చేపట్టిన రోసయ్య, ప్రస్తుత ముఖ్యమత్రి కిరణ్‌కుమార్ రెడ్డి విశ్వబ్రహ్మణుల సంక్షేమాన్ని విస్మరించారన్నారు. ఈ ప్రభుత్వానికి తగిన సమయంలో బుద్ధి చెబుతామన్నారు.


No comments:

Post a Comment