Sunday, August 21, 2011

మెగాస్టార్‌ చిరంజీవి లాంఛనంగా కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.


ప్రజారాజ్యం పార్టీ అధినాయకుడు మెగాస్టార్‌ చిరంజీవి లాంఛనంగా కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి రాహుల్‌ గాంధీ సమక్షంలో ఆయన ఆ పార్టీలో చేరారు. కాంగ్రెస్‌ పార్టీలో ప్రజారాజ్యంపార్టీ విలీనం కూడా ఇక లాంఛనమే కానున్నది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ రాజీవ్‌ గాంధీ భవిష్యత్‌ ప్రధాన మంత్రి అని, జాతిప్రజల ఆశాకిరణమని ప్రశంసలతో ముంచెత్తారు. ''నా మిగతా జీవితమంతా కాంగ్రెస్‌ పార్టీతోనే నడుస్తుంది. నేనొక నమ్మకస్తుడైన కార్యకర్తగా వుంటాను. రాహుల్‌కు కృతజ్ఞతలు. భవిష్యత్‌లో ఆయనే మా ప్రధానమంత్రి'' అని చిరంజీవి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీతోనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో రాహుల్‌గాంధీతోపాటు ఆరోగ్యశాఖ మంత్రి, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాం నబీ ఆజాద్‌, పెట్రోలియం మంత్రి జైపాల్‌రెడ్డి, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి జనార్ధన్‌ ద్వివేది, సోనియాగాంధీ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్‌ పటేల్‌లు పాల్గొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వంకోసం చిరంజీవి ఇదివరకే దరఖాస్తు చేసుకున్నారు. ఎఐసిసి కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో చిరంజీవి తన చేరిక ప్రక్రియను పరిపూర్తిచేసుకున్నారు

No comments:

Post a Comment