ఆగష్టు : తెలంగాణ కోసం మేము చేస్తున్న పోరాటం దేశభక్తిలో భాగమేనని, తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ఈరోజు( సోమవారం) తెలిపారు. జెఏసి కార్యాలయంలో ఆయన జాతీయ జెండాతో పాటు తెలంగాణ జెండాను ఎగురవేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 17న జరిగే మహాధర్నాకు తెలంగాణ వారంతా సహకరించాలని కోరారు. 17 నుండి ఉద్యమం విడతల వారీగా ఉధృతమవుతుందని అన్నారు. స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తితోనే తెలంగాణ కోసం పోరాటం చేస్తున్నామన్నారు. జాతీయ స్థాయిలో అవినీతిపై పోరాటం చేస్తున్న సామాజిక కార్యకర్త అన్నా హజారే ఉద్యమానికి జెఏసి మద్దతు ఉంటుందని కోదండరామ్ ప్రకటించారు. తెలంగాణ పోరాటం, అవినీతిపై అన్నా హజారే చేస్తున్న పోరాటం నాణేనికి రెండు పార్శ్వాలు అన్నారు. కాగా తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న సీమాంధ్ర సెటిలర్స్ చైతన్య యాత్ర సోమవారం జెఏసి కార్యాలయానికి చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమైక్యాంధ్ర నినాదం పాలకులది మాత్రమే అన్నారు.
No comments:
Post a Comment