Saturday, November 10, 2012

Thursday, November 8, 2012

పలువురు రూరల్ జిల్లానాయుకులు హర్సం వ్యక్తం చేస్తున్నారు......

జిల్లా కాంగ్రెస్ పగ్గాలు మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి దక్కడం తో పలువురు రూరల్  మరియు గ్రేటర్ జిల్లానాయుకులు హర్సం వ్యక్తం చేస్తున్నారు ముక్యంగా జి వి ఎమ్ సి 56వ వార్డ్ మాజీ కార్పోరేటర్ దుళ్ళలక్శ్మిఆవార్డ్ఇన్ చార్జ్, దుళ్ళరామునాయుడు,గొన్నబొర్రయ్యనాయ్డు,(జిబినాయుడు), బొబ్బరనారయణరావు,అట్టాసన్యాసిఅప్పారావు కొలిపాక అప్పరావు, గొళ్ళవిల్లి శ్రీనువాసురావు,అప్పికొండ మహాలక్శ్మి నాయుడు ,సాలాపు వెంకటాప్పారావు,దాసరి విజయాదిత్య, సి హెచ్ రామారావు ,సక్సెస్ న్యూస్ ఎడిటర్ ఎమ్ ఎ రాజు (బాబు)లు హర్సం వ్యక్తం చేసారు, నగేష్ స్థానంలో అదే సామాజికవర్గానికి చెందిన చోడవరం మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి కరణం ధర్మశ్రీని నియమించారు. ధర్మశ్రీ 2004లో మాడుగుల నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికై 2009 వరకూ కొనసాగారు. 

డీసీసీ అధ్యక్షునిగా కరణం ధర్మశ్రీ


జిల్లా కాంగ్రెస్ పగ్గాలు మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి దక్కాయి. ప్రస్తుత ఇన్‌చార్జి డీసీసీ అధ్యక్షుడు తోట నగేష్‌ను ఆ పదవి నుంచి తప్పించారు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని జిల్లాల అధ్యక్షులను మారుస్తూ పీసీసీ నిర్ణయం తీసుకుంది. ఆ జాబితాలో విశాఖ జిల్లా కూడా వుంది. నగేష్ స్థానంలో అదే సామాజికవర్గానికి చెందిన చోడవరం మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి కరణం ధర్మశ్రీని నియమించారు. ధర్మశ్రీ 2004లో మాడుగుల నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికై 2009 వరకూ కొనసాగారు. 2009లో చోడవరం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి అక్కడి టీడీపీ అభ్యర్థి కె.ఎస్.ఎన్.రాజు చేతిలో ఓటమి పాలయ్యారు. మరోవైపు నగర కాంగ్రెస్ అధ్యక్షునిగా విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్‌ను యధావిధిగా కొనసాగిస్తున్నారు. 



Wednesday, November 7, 2012

విశాఖ :పలుచోట్ల పొంగి ప్రవహిస్తున్న వాగులు




విశాఖ : భీమిలి మండలంలో చిప్పాడ వద్ద రోడ్డుపై నుంచి ప్రవహిస్తున్న ఉప్పుటేరు – జలదిగ్భందంలో మూలకద్దు, చిప్పాడ, సిటీనగర్, పాతపాలెం, జీరుపేట గ్రామాలు

• విశాఖ : పద్మనాభ మండలంలో పలుచోట్ల పొంగి ప్రవహిస్తున్న వాగులు, 5వేల ఎకరాల్లో వరి, బంతి, బొప్పాయి పంటలకు ముప్పు
• విశాఖ : మునగపాక మండలంలో కనపర్తి, చూసుకొండ, మెలిపాక, యాదగిరిపాలెం గ్రామాలు జలదిగ్భందంలో – సహాయం కోసం రెండు రోజులుగా ఎదురుచూస్తున్న 5వేల మంది బాధితులు

• అచ్యుతాపురం మండలంలో జలదిగ్బందంలో చిక్కుకున్న పెదపాడు, కాజీపాలెం, జగ్గన్నపేట – పూరిటిగడ్డ వద్ద తగ్గని వరద ఉద్ధృతి, నిన్నటి నుంచి పొలాల్లోనే 25మంది రైతులు
• విశాఖ : చోడవరం మండలం భోగాపురం వద్ద శారద నది వరద నీటిలో చిక్కుకున్న 8మంది రైతులు – చోడవరం మం. పీ.ఎస్.పేట సమీపంలో పెబ్బేరు గడ్డ వరద ఉద్ధృతి, మూడ్రోజులుగా చిక్కుకున్న 5గురు రైతులు

Tuesday, November 6, 2012

పాలిటెక్నిక్‌ పరీక్షలు వాయిదా


కోస్తాంధ్ర ప్రాంతాంలో భారీ వర్షాల కారణంగా పాలిటెక్నిక్‌ విద్యార్థులను సోమ, మంగళవారాల్లో నిర్వహించాల్సిన పరీక్షలను వాయిదా వేసినట్లు సాంకేతిక విద్య శిక్షణ సంస్త ( ఎన్‌బీటీఈటీ) కార్యదర్శి వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం నుంచి పరీక్షలు యథావిధిగా జరుగుతాయని పేర్కొన్నారు. వాయిదా పడిన పరీక్షల తేదీలను తరువాత ప్రకటిస్తామని వెల్లడించారు

Friday, November 2, 2012

ఎర్రన్నాయుడు మృతి టీడీపీకి తీరనిలోటు


ఎర్రన్నాయుడు మృతి టీడీపీకి తీరనిలోటు

ర్రన్నాయుడు మృతి తెలుగు దేశం పార్టీకి తీరని లోటు అని ఆపార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అన్నారు. ఎర్రన్నాయుడు మరణ వార్త విన్న ఆయన తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. ఎర్రన్నాయుడును కోల్పోవటం తన కుడి భుజాన్ని కోల్పోయినట్లు అయిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మంచి మిత్రుడు, సహచరుడుని కోల్పోయామన్నారు. 

ఆయన లేరనే దుర్వార్త వినటం చాలా దురదృష్టకరమన్నారు. రాజకీయ ఎంత ఉన్నత పదవులు ఉన్నా అణిగి ఉండే వ్యక్తి అని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఎర్రన్నాయుడు మృతి పట్ల ఆయన కుటుంబానికి చంద్రబాబు ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రజల కోసం అంకిత భావంతో పని చేసిన వ్యక్తి ఎర్రన్నాయుడు అని, పార్టీకి ఏకష్టం వచ్చినా అండగా నిలిచారన్నారు.

ఎర్రన్నాయుడుకు నివాళులు అర్పించేందుకు చంద్రబాబునాయుడు తన పాదయాత్రను రద్దు చేసుకున్నారు. బుధవారం ఉదయం ఆయన మహబూబ్ నగర్ జిల్లా పెద్దచింతకుంట నుంచి హైదరాబాద్ బయల్దేరారు. అక్కడ నుంచి విమానంలో శ్రీకాకుళం వెళ్లనున్నారు.