Thursday, April 14, 2011

ఆ ఫోన్ వస్తే కట్ చేయండి


ఆ ఫోన్ వస్తే కట్ చేయండి
మీకు ఎప్పుడైనా, ఎవరినుంచైనా ఓ ఫోన్ రావచ్చు. మొబైల్ వెరిఫికేషన్ కోసం కాల్ చేశామని చెప్పొచ్చు. ఓ చిన్న పని చేయమని అడగొచ్చు. మీ మొబైల్‌లో #90 కాని #09 టైప్ చేయమని అడగొచ్చు. అలా ఎవరైనా అడిగితే వెంటనే కాల్‌ను కట్ చేయండి. దీన్ని కొన్ని సంఘవిద్రోహశక్తులు, తీవ్రవాదులు, మోసాలకు పాల్పడుతున్నవారు తెలివిగా వాడుకుంటున్నారు. మీరు #90 కాని #09 టైప్ చేసిన వెంటనే మీ సిమ్ వారి కంట్రోల్‌లోకి వెళిపోతుంది. మీ సిమ్ ద్వారా వాళ్లు కాల్ చేసుకోవడానికి వీలు కుదురుతుంది. పని వాడు చేసుకుంటాడు.. కేసు మీ మీదకు వస్తుంది. ఇప్పటికే ఎంతోమంది దీని బారిన పడ్డారు. మీకూ అలాంటి కాల్ రాకముందే తేరుకోండి. ఇది ఊరికే చెబుతున్న మాట కాదు. కావాలంటే, ప్రభుత్వరంగ సంస్థ అయిన బిఎస్‌ఎన్ఎల్ వెబ్‌సైట్‌లోనూ మీరు వెరిపై చేసుకోవచ్చు. ఆ లింక్‌ను కూడా ఈ పోస్ట్‌లో ఇస్తున్నాం. లింక్‌ను ఓపెన్ చేసిన తర్వాత Dont'sలోచివరి పాయింట్‌ను చదవండి.

Monday, April 11, 2011

కన్యాకుమారి వద్ద మునిగిపోయిన ఓ నౌక: నౌకలోని వారు సురక్షితం..


సముద్రంలో మునిగిన ఐరన్ ఓర్ నౌక

కన్యాకుమారి వద్ద మునిగిపోయిన ఓ నౌక: నౌకలోని వారు సురక్షితం.. 
     విశాఖ నుంచి జపాన్ వెళుతున్న ఓ నౌక కన్యాకుమారి వద్ద మునిగిపోయింది. గత నెలలో ఇనుపఖనిజంతో బయల్దేరిన ఈ నౌక కన్యాకుమారి ప్రాంతంలో ప్రమాదానికి లోనైంది. సముద్రంలోని భారీ రాళ్లను ఢీకొనడంతో ఓడ సముద్రంలోకి మునిగిపోసాగింది. భద్రతా సిబ్బంది అప్రమత్తమై నౌకలోని వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. 

నవమి నాడయినా బాబా దర్శనం ఇప్పించరూ...


నవమి నాడయినా బాబా దర్శనం ఇప్పించరూ...
ఈ రోజు అనగా సోమవారం సాయంత్రం వైద్యులు విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం, సత్యసాయి బాబా వారి ఆరోగ్యం చాల త్వరగా మెరుగవుతోంది అని తెలిసింది.ఆయన బీ.పీ. మరియు షుగర్ లెవెల్స్ కూడా సరియిన స్థాయిలో ఉన్నాయి. అదేవిధంగా ఆయన గుండె కొట్టుకోవడం కూడా సరిగ్గా ఉంది. 
ఇక, కొద్ది రోజుల క్రితం వైద్యానికి సరిగ్గా స్పందించని ఆయన అంతర్గత  అవయవాలు కూడా ఇప్పుడు చక్కగా స్పందిస్తూన్నాయి. ఆయన కిడ్నీలు కూడా ఇప్పుడు చక్కగా పనిచేస్తున్నాయి. ఇక, ఆయన ఊపిరి తిత్తులలో ఉన్న ఇంఫెక్షను కూడా పూర్తిగా తొలగి పోయింది. అందువల్ల శ్వాస తీసుకోవడం కూడా ఇప్పుడు సులువయింది. అయినప్పటికీ, జాగ్రత్త కోసం వెంటిలేటర్ సప్పోర్ట్ ఉంచారు. అయితే, ఇటీవల ఆయన లివర్( కాలేయము)కి సోకిన జాండిస్ (పచ్చ కామెర్లు) గురించి సరయిన సమాచారమేది విడుదల చేసిన బులెటిన్ ఇవ్వక పోవడంతో, బాబా భక్తులు తీవ్ర అసంతృప్తికి, అందోళ్ళనకి లోన్నయారు. అన్ని బాగ్గున్నాయని చెపుతున్న  డాక్టర్లు బాబాని కనీశం వీడియో ద్వారనైనా ఎందుకు చూపించడం లేదని ప్రశ్నిస్తున్నారు. తాజా బులెటిన్ ప్రకారం డాకర్లు చెప్పిందంత నిజమే అయితే రేపు శ్రీ రామ నవమి శుభ సందర్బంగా నయినా తప్పని సరిగా తమకి బాబా దర్శనం కల్పించాలని ఆసుపత్రి సూపర్-ఇండెంట్ డా.సఫాయ మీద తీవ్ర వొత్తిడి తెస్తున్నారు. అందువల్ల, బహుశః రేపు ఏదో ఒక సమయంలో సత్యసాయి బాబా వారి దర్శనం వీడియో ద్వారనైనా జరిగే అవకాశముందని అనుకోవచ్చు.

విశాఖ ఉక్కు ఎస్‌ఎంఎస్‌లో భారీ ప్రమాదం
 ప్రతిష్టాత్మకమైన విశాఖ ఉక్కులో అదివారం ఉదయం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో ప్రాణనష్టం జరగకపోయినా, రూ.100కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. ‘ఎ’ షిప్ట్‌డ్యూటీ నిర్వహిస్తున్న 8మంది కార్మికులు ప్రమాదాన్ని పసిగట్టి పరుగులు తీయడంతో తృటిలో ప్రాణనష్టం తప్పింది. నవరత్న హోదాకలిగిన విశాఖ ఉక్కు చరిత్రలో ఇంత పెద్ద ప్రమాదం జరగడం ఇదే ప్రథమం. స్టీలు మెల్టింగ్‌షాప్‌(ఎస్‌ఎంఎస్‌) మెషిన్‌-2లో హాట్‌మెటల్‌ను తీసుకెళ్లే లేడల్‌ లెైనింగ్‌బ్రిక్స్‌ పగిలిపోవడంతో 120టన్నుల ఉక్కు నేలపాలెైంది. లేడల్‌ 150టన్నుల ఉక్కును సిసిడికి తీసుకెళ్తుంది. ఇక్కడ ఉక్కు దిమ్మలుగా మారి బయటకు వస్తుంది. అయితే, లేడల్‌ లెైనింగ్‌ బ్రిక్స్‌ పగిలిపోవడంతో 120టన్నుల ద్రవం ఉక్కు ఎస్‌ఎంఎస్‌ మెషిన్‌-2ప్రాంతంలో బయటకు చిమ్మింది. 
దీని కారణంగా ఇటీవల 80కోట్ల రూపాయల వ్యయంతో అమర్చిన ఆటో మెషీన్‌ పనికిరాకుండా పోయే ప్రమాదముందని ఉక్కు వర్గాలు చెబుతున్నాయి. ప్రమాదవశాత్తు సైడ్‌ వాల్వ్‌ క్లోజ్‌ అయినప్పుడు లేడల్‌ యాంగిల్‌ కంట్రోల్‌ రూం నుంచి మార్చే అవకాశం ఉంది. యాంగిల్‌ మారితే ద్రవ ఉక్కు బయటకు పోయి మెషినరీ సురక్షితంగా ఉండేదని కార్మికులు చెబుతున్నారు. నాణ్యత లోపించిన లెైనింగ్‌ బ్రిక్స్‌, సమయానికి స్పందించని అధికారుల నిర్లక్ష్యం వెరసి ప్రమాద తీవ్రతను పెంచాయి. 1700 డిగ్రీల ఉష్ణోగ్రత కలిగిన ఉక్కుద్రవం కారణంగా మంటలు వ్యాపించి కేబుల్స్‌, ఇన్‌స్ట్రుమెంట్స్‌ పూర్తిగా ధ్వంసమయ్యాయి.‘ఎ’షిప్ట్‌లో ఫోర్‌మేన్‌, చార్జ్‌మేన్‌, జూనియర్‌మేనేజర్‌, టెక్నీషియన్లు ఉన్నారు. ఉక్కు ప్రమాదానికి 6500హీట్లతో మార్చాల్సిన లెైనింగ్‌బ్రిక్స్‌ అంతకు మించిన హీట్ల వరకూ మార్చకపోవడంతో ప్రమాదం సంభవించినట్టు కార్మికసం ఘాలు ఆరోపిస్తున్నాయి. మెషిన్‌-2లో జరిగిన ప్రమాదానికి నిరసనగా మెషిన్‌-5, మెషిన్‌-6లో ‘ఎ’షిప్ట్‌లో పనులు నిలిపివేశారు. కాగా, యంత్రాలు పునర్నిర్మించేందుకు 3నెలల కాలం పడ్తుందని అధికారులు చెబుతున్నారు. ఉక్కులో ఆరు మెషీన్‌లు ఉండగా నాలుగు మెిషీన్‌లు మాత్రమే ప్రస్తుతం పనిచేస్తున్నాయి. ఇందులో మరో మెషీన్‌ ప్రమాదం కారణంగా నిలిచిపోయింది. దీంతో ప్రతిరోజూ వేయిటన్నుల ఉక్కు ఉత్పత్తికి అంతరాయం కలిగే అవకాశముంది. సంఘటనా స్థలిని వర్క్‌‌స జిఎం పిఎన్‌రావు, వర్క్‌‌స ఇడి రంజన్‌లు పరిశీలించి నష్టాన్ని అంచనావేస్తున్నారు.

Sunday, April 10, 2011




ఇది ఆరంభమే!
అవినీతిపై యుద్ధంలో రాజీ లేదు
ప్రజా చైతన్యానికి దేశ యాత్ర
ప్రజాగ్రహానికి మద్దతు మచ్చుతునక
యువత, ప్రజలకు హజారే పిలుపు

:అధికార్లు, ప్రజాప్రతినిధుల్లో పెచ్చుమీరుతోన్న అవినీతిపై ప్రజల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహావేశాలకు మచ్చుతునక తాను చేపట్టిన ఆమరణ నిరశనకు లభించిన మద్దతని గాంధేయవాది, సామాజిక కార్యకర్త అన్నా హజారే వ్యాఖ్యానించారు. అవినీతిని అంతం చేసే విషయంలో రాజీ పడకూడదన్న ప్రజా మనోభావాలకు ఇదొక సంకేతంగా ఆయన అభివర్ణించారు. అవినీతికి వ్యతిరేకంగా అన్నా చేపట్టిన ఆమరణ నిరశనతో దిగివచ్చిన ప్రభుత్వం, జన్‌లోక్‌పాల్ బిల్లు ప్రతిపాదనకు ఆమోదించటంతో శనివారం ఉదయం ఆయన దీక్ష విరమించారు. అనంతరం జంతర్ మంతర్ వద్ద ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. స్వతంత్ర భారత దేశ చరిత్రలో మరో కొత్త అధ్యాయం మొదలైందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.అవినీతి జాడ్యాన్ని ఏరిపారేసేంత వరకూ ప్రజలు విశ్రమించకూడదని పిలుపునిస్తూ, లంచాలు అడిగిన వారిని ఉపేక్షించవద్దని హెచ్చరించారు. జన్‌లోక్‌పాల్ బిల్లు చట్టం కానున్నందున తన బాధ్యత మరింత పెరిగిందని ఆయన హామీ ఇచ్చారు. తన దీక్షకు లభించిన ప్రజామద్దతే ప్రభుత్వం కళ్లు తెరిపించిందని చెప్పుకున్నారు. అధికార్లు, ప్రజాప్రతినిధుల్లో పెరిగిపోతున్న అవినీతికి అడ్డుకట్ట వేయనిపక్షంలో, ప్రజా జీవితాలు మరింత దుర్భరం అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. మనలో మనకు ఎన్ని అభిప్రాయబేధాలు ఉన్నప్పటికీ, అవినీతిని తుడిచిపెట్టే విషయంలో దేశంలో సమైక్యరాగం వినిపించిందని చెప్పారు. ‘్భన్నత్వంలో ఏకత్వం మన ప్రత్యేకత. అవినీతిపై ప్రజలు విసుగెత్తిపోయారు. ప్రజల ఆవేదనను గ్రహించి ప్రభుత్వం అవినీతిని అదుపుచేయటానికి ఎలాంటి చర్యలూ తీసుకోక పోవటంవల్లే, అవినీతి ఊడలు మరింత లోతుకు పాతుకుపోయాయని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తీసుకురానున్న చట్టం అవినీతికి భరత వాఖ్యం పలికి తీరుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అవినీతిపై ప్రారంభించిన ఈ యుద్ధానికి కులం మతం ప్రాంతంతో పనిలేదన్నారు. అవినీతి అంతమయ్యేంత వరకూ విశ్రమించరాదని ప్రజలకు పిలుపునిచ్చారు. తాను ప్రారంభించిన దీక్షకు వివిధ వర్గాలు, ముఖ్యంగా యువతనుంచి లభించిన మద్దతుకు ప్రభుత్వం గడగడలాడిందని అన్నా హజారే ఆనందంగా చెప్పారు. అవినీతిని రూపుమాపటంలో యువత కీలకపాత్ర వహించాలని హజారే సూచించారు. జన్‌లోక్‌పాల్ బిల్లు ముసాయిదాను తయారు చేయటానికి ఒక కమిటీని ఏర్పాటు చేయటానికి ప్రభుత్వం అంగీకరించినంత మాత్రాన సమస్య పరిష్కారం కాలేదని, అసలు పోరాటం ఇక్కడి నుంచే మొదలవుతుందని గుర్తు చేశారు. లక్ష్య సాధనలో మనం ఇంకా చాలా దూరాన్ని అధిగమించాల్సి ఉందని హజారే చెప్పుకొచ్చారు. బిల్లును వ్యతిరేకించే రాజకీయ నాయకులకు పుట్టగతులు ఉండవని హెచ్చరించారు దేశంలో పర్యటించి అవినీతికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరుస్తానని హామీ ఇచ్చారు.
దీక్ష విరమించిన హజారే
ఫలితాన్నిచ్చిన ఆమరణ నిరశన జన్‌లోక్‌పాల్ ముసాయిదా కమిటీకి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ మద్దతుదారుల్లో పెల్లుబికిన ఆనందం
 హజారే సత్యాగ్రహం అంతిమ విజయం సాధించింది. స్వతంత్ర భారత చరిత్రలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. అవినీతికి వ్యతిరేకంగా సాగించిన అహింసాయుత యుద్ధంలో విజయం సాధించిన అన్నా హజారే, ఈతరానికి స్ఫూర్తిగా నిలిచారు. జాతిపిత త్రికరణ శుద్ధిగా నమ్మి ఆచరించిన అహింసా మార్గంలో 97గంటల నిరాహార దీక్ష సాగించి ప్రభుత్వం మెడలు వంచిన హజారే, అవినీతికి వ్యతిరేకంగా పోరాడగల ఆత్మవిశ్వాసాన్ని బలమైన ఆయుధంగా ప్రజలకు అందించారు. నాలుగు దశాబ్దాల కాలంలో ఎవ్వరూ సాధించలేకపోయిన విజయాన్ని ప్రజా మద్దతుతో సాధించి, ప్రజాబలంతో ఏ సమస్యనైనా పరిష్కరించుకోగలమని నిరూపించారు. చీడపురుగు మాదిరి దేశాన్ని పట్టి పీడీస్తున్న అవినీతికి వ్యతిరేకంగా గాంధేయవాది అన్నాహజారే ప్రారంభించిన ఆమరణ దీక్షకు ప్రజల నుంచి లభించిన స్పందన, కేంద్ర ప్రభుత్వాన్ని తట్టి లేపింది. అవినీతిని రూపుమాపే విషయంలో తమ చిత్తశుద్ధి శంకించవద్దన్న సంకేతాన్ని పంపుతూ కేంద్రం అన్నాహజారే చేసిన ప్రతిపాదనలకు లోబడి లోక్‌జన్‌పాల్ బిల్లు ముసాయిదా తయారీకి అంగీకరించటంతో అన్నా హజారే, ఆయన మద్దతుదారులు సుమారు 97 గంటలపాటు నిర్వహించిన ఆమరణ దీక్షకు తెరపడింది. శనివారం ఉదయం పది గంటల సమయంలో అన్నా హజారే, ముందు తన సహచరులతో దీక్ష విరమింప చేశారు.తరువాత ఒక చిన్న పాప అందించిన నిమ్మరసం తీసుకుని దీక్షకు స్వస్థి చెప్పారు. ఆయన దీక్ష విరమించగానే జంతర్ మంతర్ వద్ద పండుగ వాతావరణం కనిపించింది. అంతేగాక ఇకనుంచి అధికారులకు లంచం ఇవ్వకుండానే పనులు చేయించుకోగలమన్న ఆత్మవిశ్వాసం తోణికిసలాడిందని చెప్పక తప్పదు. 40 ఏళ్లనుంచీ అతీగతీ లేకుండా పడివున్న లోక్‌పాల్ బిల్లు జన్‌లోక్‌పాల్ బిల్లుగా రూపాంతరం కాబోతోంది. జన్‌లోక్‌పాల్ బిల్లుకు బలమైన అధికారాలను ఆపాదిస్తూ, పటిష్టంగా రూపకల్పన చేయటానికి పదిమంది సభ్యులతో ఒక సంఘాన్ని ఏర్పాటు చేయటానికి కేంద్రం అంగీకరించింది. ఈమేరకు కేంద్రం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. అన్నాహాజారే డిమాండ్ చేసినట్టు కమిటీలోని పదిమందిలో ఐదుగురు పౌర సమాజం నుంచి ఉంటారు. ఐదుగురు మంత్రులు కమిటీలో భాగస్వాములు అవుతారు. కేంద్ర ఆర్దిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఈ సంఘానికి అధ్యక్షులుగా ఉంటారు. కాగా మాజీ న్యాయ శాఖ మంత్రి శాంతి భూషణ్ సహాధ్యక్షులుగా ఉంటారు. న్యాయశాఖా మంత్రి వీరప్ప మొయిలీ, హోంమంత్రి పి చిదంబరం, జలవనరుల మంత్రి సల్మాన్ ఖుర్షీద్‌తో పాటు హజారేతో దీక్ష విరమింప చేయటంలో కీలకపాత్ర వహించిన మానవ వనరుల అభివృద్ధి శాఖామంత్రి కపిల్ సిబల్ ప్రభుత్వం తరఫున సంఘంలోఉంటారు. పౌర సమాజం పక్షాన శాంతి భూషణ్‌తోపాటు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు ప్రశాంత్ భూషణ్, ఎన్ సంతోష్ హేగ్డే, అన్నా హజారే, అరవింద్ కేజ్రీవాల్ సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీని ఏర్పాటు చేస్తూ న్యాయ శాఖ కార్యదర్శి వికె భాషన్ సంతకంతో శనివారం ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఈ కమిటీ జూన్ నెలాఖరుకు తన ముసాయిదాను ప్రభుత్వానికి అంద చేయాల్సి ఉంటుంది. ముసాయిదాను అధ్యయనం చేసిన తరువాత ప్రభుత్వం బిల్లును వర్షాకాలపు సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి.



Tuesday, April 5, 2011

సమైక్యాంధ్ర జ్యోతిష్కులు వర్సెస్ తెలంగాణా జ్యోతిష్కులు


సమైక్యాంధ్ర జ్యోతిష్కులు వర్సెస్ తెలంగాణా జ్యోతిష్కులు
ఉగాది పర్వదినం తెలంగాణా జ్యోతిష్కులు, సమైక్యాంధ్ర జ్యోతిష్కుల మధ్య చిచ్చు పెట్టింది. సోమవారం ఉగాది పండుగనాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పంచాంగం వినిపించిన ప్రముఖ జ్యోతిష్కులు వచ్చే ఏడాది కూడా ఉగాది సమైక్యాంధ్రలోనే జరుగుతుందని వ్యాఖ్యానించారు. దీనిపై తెలంగాణా రాష్ట్ర సమితి నాయకుడు హరిశ్ రావు మండిపడ్డారు. 
టీడీపి పంచాంగం పచ్చి అబద్ధమని ధ్వజమెత్తింది. చంద్రబాబు నాయుడు సమైక్యాంధ్రకు అనుకూలంగా పంచాంగం చెప్పాలని జ్యోతిష్కులపై ఒత్తిడి తెచ్చిన ఫలితంగానే అటువంటి వ్యాఖ్య చేసి ఉంటాన్నారు. తెలంగాణా ప్రాంత జ్యోతిష్యుడు దామోదర్ శర్మ మాట్లాడుతూ... సోమవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వెల్లడించిన పంచాంగం శుద్ధఅబద్దమనీ, వచ్చే మే నెల 21 తేదీ లోపు తెలంగాణా రాష్ట్రం ఏర్పాటై తీరుతుందని చెప్పుకొచ్చారు. మరి ఎవరి జ్యోతిష్యం కరెక్టవుతుందో చూద్దాం.

అధిష్టానం వద్ద మోకరిల్లండి.. పోటీ నుంచి తప్పుకుంటా!!


అధిష్టానం వద్ద మోకరిల్లండి.. పోటీ నుంచి తప్పుకుంటా!!
యువనేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి వర్గానికి రాష్ట్ర మంత్రి వైఎస్.వివేకానంద రెడ్డి ఒక ఆఫర్ ప్రకటించారు. జగన్‌తో పాటు ఆయన వర్గానికి చెందిన నేతలంతా కాంగ్రెస్ అధిష్టానం వద్ద మోకరిల్లితే తాను ఉప ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. రాజకీయాల్లో బంధుబంధుత్వాలు పని చేయవని, రాజకీయాలు వేరు, బంధుత్వాలు వేరని చెప్పుకుంటూ వచ్చిన వివేకా.. ఒక్కసారి ఇలా ప్రకటించడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. తన అన్న వైఎస్‌ఆర్‌ రాముడైతే.. తాను లక్ష్మణుడు అని మొన్నటికి మొన్న అసెంబ్లీ సాక్షిగా వివేకా ప్రకటించి ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. తాజాగా, జగన్ వర్గంపై నిప్పులు చెరిగారు. జగన్ వర్గం నేతలు చేసిన తప్పులు అంగీకరించి కాంగ్రెస్ హైకమాండ్‌కు లొంగిపోవాలని సూచించారు. ఇలా చేయడం ద్వారా తాను ఉప ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. అంతేకాకుండా, జగన్‌కు ఒక హితబోధ కూడా చేశారు. అన్ని వేళలా సెంటిమెంట్ కూడా పని చేయదని చిన్నపాటి ఉచిత సలహా కూడా ఇచ్చారు మంత్రివర్యులు.