ప్రజలు కష్టాల్లో ఉన్నారు. వారి కష్టాలకు పాలకులే కారణం.. మేము అధికారంలోకి వస్తే అందరి కష్టాలు తీరుస్తాం.... గతంలో అధికారంలోకి వచ్చినప్పుడు కష్టాలు పెంచారు. ఎలా తీరుస్తారు. అనేదానికి సమాధానం లేదు. నయాఉదారవాద విధానాలను మాజీ ప్రధాని పివి నర్సింహారావు ఆధ్యుడయితే ఆంధ్రప్రదేశ్‌లో అమలు వేగంగా జరిగేందుకు నారాచంద్రబాబు నాయుడు ఆజ్యం పోశారు. అందులో భాగంగానే విద్యుత్‌ను విభజించి ప్రయివేట్ పరం చేసి ఛార్జీలు పెంచుకోవడానికి అవకాశామిచ్చారు. రైతుల రుణాలు పెరగడానికి ప్రధాన కారకులయ్యారు. సంస్కరణల పుణ్యమాని వృత్తులన్నీ నాశనమయ్యాయి. వీటన్నింటికీ కారకుడు చంద్రబాబునాయుడని ప్రచారం చేసుకుని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రాజశేఖర్‌రెడ్డి నాయకత్వంలో దోపిడీ దొంగలందరూ ఏకమై రాష్ట్రాన్ని దోచుకుతిన్నారు. అత్యధికంగా ఆయన కుమారుడు వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి దోచుకున్నాడని జైల్లో పెట్టారు. ఐదుగురు మంత్రులు కూడా ఆ ఉచ్చులో ఇరుకున్నారు. అది జగమెరిగిన సత్యంగా ప్రచారం జరిగింది. ఒక పార్టీ పెట్టుకుంటే ప్రజలను పోగేసుకుంటే తప్పులన్నీ మాఫీ అవుతాయని వైఎస్‌ఆర్‌సిపి అనే పేరుతో పార్టీని ప్రారంభించారు. అయినా కటకటాలు తప్పలేదు. మేమున్నాం.... మిమ్ములను ఆదుకుంటాం.... మమ్ములను ఆదరించండని పాదయాత్రలు చేస్తున్నారు. టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అనంతపురం జిల్లా హిందూపురం నుంచి గాంధీజయంతి సందర్భంగా ప్రారంభించారు. అక్టోబర్ 18 నుంచి వైఎస్‌సిపి నేత షర్మిల పాదయాత్రను ప్రారంభించారు. అయితే గతంలో నాశనం చేశావు.. మరో అవకాశం ఇస్తే నాశనం చేయరనే నమ్మమేముంది. అనేతరహాలో ప్రజలు ఉన్నారు. అదేవిధంగా గతంలో రాష్ట్రాన్ని లూటీ చేశారు. మరో అవకాశం ఇస్తే లూటీ చేయరా అని టిడిపి, వైఎస్‌ఆర్‌సిపిల పట్ల ఉండరా అనేది ఆలోచించాలి.
జనం ఎవరి వెంట ఎక్కువ పోతారు?
సంస్కరణలను ఆపేయండి లేదా... ధరలను తగ్గించండి....పేదలకు భూములు పంచండి. అవినీతిని అరికట్టండి... ప్రస్తుతం ప్రజలను పట్టి పీడిస్తున్న తెలంగాణా, సమైక్యాంధ్ర సమస్యలకు పరిష్కారం చూపుతాం. ఇలా ఏదో ఒక అంశాన్ని ఎంచుకుని పాదయాత్ర చేసే వారి వెంట ఎక్కువ మంది ర్యాలీ అయ్యే అవకాశం ఉంది. విధానమేంటనేది చెప్పకుండా వెళ్లే వారిని ప్రజలు ఎలా నమ్ముతారు?.
No comments:
Post a Comment