Saturday, October 27, 2012
Friday, October 26, 2012
Tuesday, October 23, 2012
అసలు ఈ యాత్రలు ఎవరికోసం...!!?
ప్రజలు కష్టాల్లో ఉన్నారు. వారి కష్టాలకు పాలకులే కారణం.. మేము అధికారంలోకి వస్తే అందరి కష్టాలు తీరుస్తాం.... గతంలో అధికారంలోకి వచ్చినప్పుడు కష్టాలు పెంచారు. ఎలా తీరుస్తారు. అనేదానికి సమాధానం లేదు. నయాఉదారవాద విధానాలను మాజీ ప్రధాని పివి నర్సింహారావు ఆధ్యుడయితే ఆంధ్రప్రదేశ్‌లో అమలు వేగంగా జరిగేందుకు నారాచంద్రబాబు నాయుడు ఆజ్యం పోశారు. అందులో భాగంగానే విద్యుత్‌ను విభజించి ప్రయివేట్ పరం చేసి ఛార్జీలు పెంచుకోవడానికి అవకాశామిచ్చారు. రైతుల రుణాలు పెరగడానికి ప్రధాన కారకులయ్యారు. సంస్కరణల పుణ్యమాని వృత్తులన్నీ నాశనమయ్యాయి. వీటన్నింటికీ కారకుడు చంద్రబాబునాయుడని ప్రచారం చేసుకుని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రాజశేఖర్‌రెడ్డి నాయకత్వంలో దోపిడీ దొంగలందరూ ఏకమై రాష్ట్రాన్ని దోచుకుతిన్నారు. అత్యధికంగా ఆయన కుమారుడు వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి దోచుకున్నాడని జైల్లో పెట్టారు. ఐదుగురు మంత్రులు కూడా ఆ ఉచ్చులో ఇరుకున్నారు. అది జగమెరిగిన సత్యంగా ప్రచారం జరిగింది. ఒక పార్టీ పెట్టుకుంటే ప్రజలను పోగేసుకుంటే తప్పులన్నీ మాఫీ అవుతాయని వైఎస్‌ఆర్‌సిపి అనే పేరుతో పార్టీని ప్రారంభించారు. అయినా కటకటాలు తప్పలేదు. మేమున్నాం.... మిమ్ములను ఆదుకుంటాం.... మమ్ములను ఆదరించండని పాదయాత్రలు చేస్తున్నారు. టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అనంతపురం జిల్లా హిందూపురం నుంచి గాంధీజయంతి సందర్భంగా ప్రారంభించారు. అక్టోబర్ 18 నుంచి వైఎస్‌సిపి నేత షర్మిల పాదయాత్రను ప్రారంభించారు. అయితే గతంలో నాశనం చేశావు.. మరో అవకాశం ఇస్తే నాశనం చేయరనే నమ్మమేముంది. అనేతరహాలో ప్రజలు ఉన్నారు. అదేవిధంగా గతంలో రాష్ట్రాన్ని లూటీ చేశారు. మరో అవకాశం ఇస్తే లూటీ చేయరా అని టిడిపి, వైఎస్‌ఆర్‌సిపిల పట్ల ఉండరా అనేది ఆలోచించాలి.
జనం ఎవరి వెంట ఎక్కువ పోతారు?
సంస్కరణలను ఆపేయండి లేదా... ధరలను తగ్గించండి....పేదలకు భూములు పంచండి. అవినీతిని అరికట్టండి... ప్రస్తుతం ప్రజలను పట్టి పీడిస్తున్న తెలంగాణా, సమైక్యాంధ్ర సమస్యలకు పరిష్కారం చూపుతాం. ఇలా ఏదో ఒక అంశాన్ని ఎంచుకుని పాదయాత్ర చేసే వారి వెంట ఎక్కువ మంది ర్యాలీ అయ్యే అవకాశం ఉంది. విధానమేంటనేది చెప్పకుండా వెళ్లే వారిని ప్రజలు ఎలా నమ్ముతారు?.
Friday, October 19, 2012
అన్‌రాక్ పై మా పోరాటం ఆగదు...!!?
అన్‌రాక్ పై మా పోరాటం ఆగదు...!!?
అన్‌రాక్ నిర్వాసితులు, కార్మికుల సమస్యలను పరిష్కరించేవరకు యాజమాన్యంపై పోరాటం ఆగదని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. అన్‌రాక్ యాజమన్యం తీరును నిరసిస్తూ, నిర్వాతుల, కార్మికుల సమస్యలపై తన కుమారుడు విజయ్ ఆధ్వర్యంలో టీడీపీ, సీపీఐ కలిసి తామరం నుంచి విశాఖకు చేపట్టిన పాదయాత్రను కామేశ్వరమ్మ గుడి వద్ద అయ్యన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అన్‌రాక్ యాజమాన్యానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. అన్‌రాక్ కంపెనీ వల్ల రానున్న రోజుల్లో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని అన్నారు. అదే విధంగా ప్రజలు పలురకాల వ్యాధులబారిన పడతారని అందోళన వ్యక్తం చేశారు.
అయ్యన్న యువసేన అధ్యక్షుడు చింతకాయల విజయ్ మాట్లాడుతూ, అన్‌రాక్ వద్ద పక్కనే వున్న ఏలేరు నీరు కలుషితమై విశాఖ వాసులు కూడా రోగాలబారిన పడతారని ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో అన్‌రాక్ కంపెనీపైనే కాకుండా కాలుష్యాన్ని వెదజల్లే కంపెనీలు, నిర్వాతులు, కార్మికుల సమస్యలపై అన్ని కంపెనీలపైనా పోరాటాలు చేస్తామన్నారు.ఈ పాదయాత్రలో మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తి, మాధంశెట్టి నీలబాబు,కోమటి వెంకటరావు,రౌతు శ్రీనువాసురావు బొడ్డపల్లి అప్పారావులు తో పాటు, దానబోయిన నీలకంటరావు గొల్లవిల్లి నాగరాజు తదితరులుఉన్నారు. కొంతదూరం వరకు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో జీవీఎంసీ టీడీపీ అధ్యక్షుడు పీలా శ్రీనివాసరావు, స్థానిక మండల టీఎన్‌టీయూసీ రాష్ట్ర కార్యదర్శి విళ్ళా రామ మోహనరావు, గొలుగొండ, నర్సీపట్నం, మాకవరపాలెం మండలాల నాయకులు, కార్యకర్తలు, అన్‌రాక్ నిర్వాసితులు పాల్గొన్నారు.
Friday, October 12, 2012
తాడి గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్
తాడి గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్
జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ విడుదల చేస్తున్న కాలుష్యం కారణంగా అవస్థలు పడుతున్న తాడి గ్రామాన్నితేది11-10-2012 గురువారం జిల్లా కలెక్టర్ వి.శేషాద్రి సందర్శించారు. ఫార్మాసిటీ అనుకుని ఉన్న తాడి గ్రామాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించాలని గత మూడేళ్లగా గ్రామస్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తేది 08-10-2012 సోమవారం అర్థరాత్రి తాడి బీసీకాలనీకి అనుకుని ఉన్న ఆక్టస్ ఫార్మా లిమిటెడ్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమాదం తాడి ప్రజలను పరుగులు తీయించిన విషయం తెలిసిందే.దీంతో మరుసటి రోజు మంగళవారం ఉదయం తాడి గ్రామస్థులు ఫార్మాసిటీలో ధర్నా చేయడం,తేది 10-10-2012 బుధవారం మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తి నేతృత్వంలో తాడి గ్రామస్థులు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఆ ఆందోళన వివాదానికి దారి తీసింది. ఆందోళనలో పాల్గొన్న టిడిపి నేతలు బండారు సత్యనారాయణమూర్తి, మాధంశెట్టి నీలబాబు,కోమటి వెంకటరావు, బొడ్డపల్లి అప్పారావులోపాటు మరో ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. కాలుష్యం కోరల్లో చిక్కుకున్న తాడి గ్రామాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించే వివాదం రోజురోజుకు జటిలమోవుతుంది. ఈ తరుణంలో జిల్లా కలెక్టర్ వి.శేషాద్రితోపాటు జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, ఎపిఐఐసిఇడి సత్యనారాయణరావు, ఆర్డీవో రంగయ్య, ఎపిఐఐసి జోనల్ మేనేజర్‌తోపాటు ఉన్నతస్థాయి అధికారులు తాడి గ్రామాన్ని సందర్శించారు. కలెక్టర్ శేషాద్రి తాడి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తాడి గ్రామానికి అనుకుని ఔషధ కంపెనీలను నిర్మించారన్నారు. దీనికారణంగా తాడి ప్రజలు కాలుష్యం బారిన పడుతున్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్ళారు. మంచినీటి వనరులు కలుషితమైన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకు వెళ్లారు. తాడి గ్రామం తరలింపు అధికారులు, రాంకీ యాజమాన్యం ఇచ్చిన హామీలను వివరించారు. రాంకీ యాజమాన్యం నిర్మించిన ల్యాండ్‌ఫిల్‌ను గురించి తెలియజేశారు.
మా ప్రాణాలను కాపాడండి.. కలెక్టర్ కాళ్ళు పట్టుకున్న ప్రజలు
ఫార్మాసిటీ విడుదల చేస్తున్న కాలుష్యం, జరుగుతున్న సంఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయని తాడి గ్రామస్థులు కలెక్టర్‌కు తెలియజేశారు. నిత్యం ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితి నెలకొందన్న విషయాన్ని ప్రజలు కలెక్టర్ శేషాద్రి కాళ్లపై పడి చెప్పారు. కాలుష్యం కారణంగా తాడి ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్న విషయాన్ని తెలియజేశారు. దీనిపై స్పందించి తాడి ప్రజలకు ప్రాణబిక్ష పెట్టాలని వారంతా కోరారు. దీనిపై కలెక్టర్ మాట్లాడుతూ ఈ సమస్యలను పూర్తిగా పరిశీలిస్తామన్నారు. దీనిపై ఒక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందిస్తామన్నారు. తాడి ప్రజలకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. దీంట్లో కలెక్టర్ రాంకీ యాజమాన్యం నిర్మించిన ల్యాండ్‌ఫిల్‌ను పరిశీలించారు. కలెక్టర్ వెంట అధికారులు ఎల్.విజయసారధి, బి.వెంకటేశ్, నేతలు మాధంశెట్టి నీలబాబు, బొడ్డపల్లి అప్పారావు పాలవలస అప్పలాచారి దానబోయిన నీలకంటరావు గొల్లవిల్లి నాగరాజు తదితరులుఉన్నారు.
Wednesday, October 10, 2012
Tuesday, October 9, 2012
ఫార్మాసిటీ వద్ద ఉద్రిక్త వాతావరణం
విశాఖ : పరవాడ ఫార్మాసిటీ వద్ద మంగళవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సోమవారం అర్థరాత్రి ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం జరగటంతో తాడి గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఫార్మాసిటీలో వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఫార్మా కంపెనీలను జనావాసాల నుంచి ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. విధులకు వెళుతున్న అయిదు కంపెనీల కార్మికులను అడ్డుకున్నారు. అంతే కాకుండా రాళ్లు రువ్వారు. పరిస్థితి అదుపు తప్పటంతో పోలీసులు భారీగా మోహరించారు. గ్రామస్తులు ఆందోళనను కొనసాగిస్తున్నారు.
Subscribe to:
Posts (Atom)