శివకాశిలో భారీ అగ్నిప్రమాదం
బాధితులను కాపాడేందుకు వెళ్ళిన వారు కూడా తీవ్రగాయాలయ్యాయని ,వారిలో నలుగురు విలేకరులు కూడా వున్నారని అధికారులు తెలిపారు.మంటలు వంద అడుగుల ఎత్తున ఎగసిపడ్డాయి. ఫైర్ ఇంజన్లు వచ్చి మంటల్ని అదుపు చేసాయి. ఎక్కువమంది అనుభవంలేని కార్మికులు ఉండటంతోనే ఈ ప్రమాదం సంభవించిందని తెలిసింది.శివకాశి కి ఏడు కిలోమీటర్ల దూరం లోని సదానందపురం లో ఈ ప్రమాదం జరిగింది.
శివకాశిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈఘటనలో 54మంది కార్మికులు చనిపోగా 78మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని శివకాశి, మదురై ఆస్పత్రులకు తరలించారు. మంటలు అదుపులోకి తేవడానికి ఐదు గంటలకుపై అగ్నిమాపక సిబ్బంది శ్రమించాల్సి వచ్చింది. బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుళ్లతో మూడు గోడౌన్లు, 40గదులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దాదాపు 200 మీటర్ల మేర మంటలు వ్యాపించాయి. ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు 300మంది కార్మికులకు పైగా పనిచేస్తున్నారు.
శిధిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక సిబ్బంది చాకచక్యంగా ప్రయత్నించారు. ఇక్కడ ప్రతి ఏటా అగ్ని ప్రమాదాలు సంభవిస్తునే ఉన్నాయి. వందలాది మంది కార్మికులు చనిపోతున్నారు. అయినా యాజమాన్యాలు గానీ, అధికారులు గానీ సరైన భద్రతా చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. బాణాసంచా తయారీకి శివకాశి భారతదేశంలోనే అతిపెద్ద మార్కెట్.
అయితే దిపావళి సమీపిస్తుండటంతో బాణాసంచా డిమాండ్ పెరిగిన నేపథ్యంలో వందలాది మంది కార్మికులు ముమ్మరంగా పనులు సాగిస్తున్నారు. దీంతో ఎలాంటి జాగ్రతలు పాటించకపోవడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనతో పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అగ్ని ప్రమాదంలో సహాయక చర్యలు చేపట్టేందుకు ఐదుగురు మంత్రులు పర్యవేక్షించనున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.
ప్రమాదంలో చనిపోయిన బాధిత కుంటుంబాలకు ప్రభుత్వం రెండు లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ప్రమాద స్థలాన్ని పరిశీలించేందుకు ముఖ్యమంత్రి జయలిత దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు,
బాధితులను కాపాడేందుకు వెళ్ళిన వారు కూడా తీవ్రగాయాలయ్యాయని ,వారిలో నలుగురు విలేకరులు కూడా వున్నారని అధికారులు తెలిపారు.మంటలు వంద అడుగుల ఎత్తున ఎగసిపడ్డాయి. ఫైర్ ఇంజన్లు వచ్చి మంటల్ని అదుపు చేసాయి. ఎక్కువమంది అనుభవంలేని కార్మికులు ఉండటంతోనే ఈ ప్రమాదం సంభవించిందని తెలిసింది.శివకాశి కి ఏడు కిలోమీటర్ల దూరం లోని సదానందపురం లో ఈ ప్రమాదం జరిగింది.
No comments:
Post a Comment