Monday, September 24, 2012

Chandrika Slideshow Slideshow

Chandrika Slideshow Slideshow: TripAdvisor™ TripWow ★ Chandrika Slideshow Slideshow ★ to Visakhapatnam. Stunning free travel slideshows on TripAdvisor

Friday, September 21, 2012

టీ టి డి ఈవో, ఛైర్మన్ (కంకణం) మధ్య వివాదం


టీ టి డి ఈవో, ఛైర్మన్ (కంకణం) మధ్య వివాదం

ప్తగిరులు బ్రహ్మోత్సవ శోభతో విరాజిల్లుతున్నాయి. వెంకన్న నామస్మరణతో ఏడుకొండలు మార్మోగుతున్నాయి. గోవిందా నీవే దిక్కంటూ శేషాచలంలో కోలాహలం సంతరించుకుంది. అదే సమయంలో వివాదాలూ రచ్చకెక్కుతున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో కంకణధారణ కలకలం రేపింది. ఇంతకూ ఏం జరిగింది? 

కంకణధారణపై ఈవో, ఛైర్మన్  మధ్య వివాదం
బ్రహ్మోత్సవాలకు ఈవో కంకణం కట్టుకోవడం ఆనవాయితీ
దీక్షతోనూ, నిష్ఠతోనూ నిర్వహిస్తామని స్వామి ఎదుట ప్రమాణం
సీఎం పర్యటనలో కంకణం కట్టుకున్న బాపిరాజు
ఇద్దరికి కంకణం కట్టడం ఆనవాయితీ కాదు
కంకణం ఉన్నా లేకున్నా ఉత్సవాల్లో పాల్గొంటానన్న ఈవో
నియమాలు తెలియవంటున్న బాపిరాజు

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడంటే అందరికీ భక్తిభావమే. వేంకటేశుని దివ్య మంగళ స్వరూపం చాడాలన్న తపనతో ఏడుకొండలెక్కిన ప్రతి ఒక్కరిలోనూ ఆధ్మాత్మిక చింతనే. మాములు రోజుల్లోనే కిటకిటలాడే సప్తగిరులు... బ్రహ్మోత్సవాల సమయంలో మరింత హోరెత్తుతాయి. గోవిందా నామ స్మరణతో మార్మోగుతాయి. పద్మావతి వల్లభుని దర్శించి తరించాలన్న ప్రతి భక్తిని మది.... భక్తిభావంతో పొంగిపొర్లుతుంది. హృదయం నిండా అడుగడుగు దండాల వాడినే నింపుకొని తన్మయత్వంతో తపన పడే ప్రతి ఒక్కరూ తిరుమలగిరులపై ఎక్కడ చూసినా కనిపిస్తారు. గోవిందుడు అందరి వాడేలే అంటూ గొంతెత్తుతారు.  ఇంతటి ఆధ్మాత్మిక  క్షేత్రంలో ఇంతటి పరమ పుణ్యక్షేత్రంలో తరుచూ వివాదాలు చెలరేగడం సగటు భక్తుని ఆవేదనకు గురిచేస్తోంది.

బ్రహ్మోత్సవాల సమయంలో కంకణధారణపై టీటీడీ ఛైర్మన్ , ఈవోల మధ్య రాజుకున్న వివాదం చర్చనీయాంశమైంది. ఈ వివాదం చిలికిచిలికి గాలివానగా మారడమే విడ్డూరం. సాధారణంగా ఆలయ ఉన్నతాధికారి శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణదారుడిగా కంకణం కట్టుకోవడం ఆనవాయితీ. ధ్వజారోహణం తర్వాత స్వామి వారి ఉత్సవాలను అకుంఠిత దీక్షతోనూ, నిష్టగా నిర్వహిస్తామని శ్రీవారి ఎదుట ప్రమాణం చేసి తిరుమలను వదలి వెళ్లకుండా ఉత్సవాలను నిర్వహించడం పరిపాటి. కానీ ఈసారి టీటీడీ ఛైర్మన్  కనుమూరి బాపిరాజు కంకణం కట్టించుకోవడమే అసలు వివాదానికి కారణం. ముఖ్యమంత్రి పర్యటనలో ఉండగానే బాపిరాజు ఆలయంలోకి వెళ్లి కంకణం కట్టించుకోవడం ఈఓకు కోపం తెప్పించింది.

బ్రహ్మోత్సవాల నిర్వహణాధికారులు ఇద్దరు కంకణం కట్టించుకోవాలని తొలత భావించినా ఆగమశాస్త్రం నిభంధనలు అడ్డురావడంతో ఈఓ వెనక్కి తగ్గారు. తాను కంకణం కట్టించుకున్నా.. లేకపోయినా స్వామి సేవల్లో నిష్ఠగా పాల్గొంటానని ఈవో అంటున్నారు. దీనిపై బాపిరాజు కూడా వివరణ ఇచ్చారు. తనకు ఎలాంటి నియమాలు తెలియవని.. ఆలయ సిబ్బంది వచ్చి తనను కంకణ మహోత్సవానికి అహ్వానించారని చెప్పారు. గతంతో కొంత మంది ఛైర్మన్లు బ్రహ్మోత్సవాలకు కంకణం కట్టించుకోని నిర్వహణదారులుగా వ్యవహారించారని చెప్పడంతో తానూ అసక్తి చూపానన్నారు.  మొత్తానికి కిందటేడాది బ్రహ్మోత్సవాల్లో కలసికట్టుగా ఆడిపాడిన ఛైర్మన్ , ఈవోలు ఈసారి ఎడమొహం, పెడమొహంగా ఉన్నారు. ఇద్దరి మధ్య కంకణ వివాదం కలకలం రేపింది.

Thursday, September 20, 2012

భారత్ బంద్


కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు నిరసనగా గురువారం భారత్ బంద్‌లో భాగంగా దేశవ్యాప్త ప్రదర్శనలు, ధర్నాలు సాగుతున్నాయి. ఢిల్లీలో పెద్దఎత్తున జరిగే ధర్నాలో టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు సీపీఎం, సీపీఐ ప్రధాన కార్యదర్శులు ప్రకాష్ కరత్, సురవరం సుధాకరరెడ్డి, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం, జేడీఎస్ అధ్యక్షుడు దేవెగౌడ లు ఆద్వర్యంలో జరుగుతుంథి. బీజేడీ, ఆరెస్పీ, ఫార్వర్డ్‌బ్లాక్ తదితర పార్టీల నేతలూ హాజరవుతారు. యూపీఏకి మద్దతిస్తున్న ములాయం వామపక్షాలు, చంద్రబాబుతో జతకట్టి ధర్నా చేస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.




రాష్ట్రంలో కాంగ్రెస్ మినహా మిగిలిన అన్ని పార్టీలు బంద్‌కు సై అన్నాయి. ప్రధాన ప్రతిపక్షం టీడీపీతోపాటు టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం, బీజేపీ బంద్‌లో పాల్గొన్నాయి. వైసీపీ కూడా నిరసనలకు పిలుపునిచ్చింది. ఉదయం ఐదు గంటల నుంచే బస్సులను అడ్డుకున్నారు 

Monday, September 10, 2012

ఉప్పుటేరులో గట్టును తొగించిన అధికారులు







విశాఖపట్టణం జిల్లా పరవాడ మండలం ముత్యాలంపాలెం ఉప్పుటేరుకు అడ్డంగా వేసిన గట్టును సోమవారం రెవెన్యూ,పోలీసు అధికారులు తొలగించారు.సింహాద్రి ఎన్టీపీసీలో ఉపాది కల్పించాలని కోరుతూ మత్య్సకారులు ఇరవై ఆరురోజులు క్రితం ఉప్పుటేరుకు అడ్డంగా గట్టు వేసిన సంగతి తెలిసిందే  దీంతో పంటపొలాలు చేపలు చెరువులు ముంపునకు గురయ్యాయి ఆర్డీవో  మత్య్సకారులుతో పలు దపాలు చర్చలు జరిపి నప్పటకీ పలితం లేకపోవడంతో భారీపోలీస్ బంధోబస్తుతో గట్టును తొలగించారు.అడ్డుకున్న మత్య్సకారులును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఆర్డీవో రంగయ్య ,ఎసిపి రవిబాబు ఆద్వర్యంలో ముత్యాలమ్మపాలెం మత్స్యకార గ్రామాన్ని పోలీస్ బలగాలు  ఆధీనంలోకి తీసుకున్నాయి. భారీగా సాయుధ బలగాలను మోహరించారు. పోలీస్ ఉన్నతాధికారులు ముత్యాలమ్మపాలెం గ్రామాన్ని  సందర్శించారు. సుమారు 25 మంది సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, 50 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లు, ఏడు వందల మంది సిబ్బందిని ముత్యాలమ్మపాలెంలో మోహరించారు. నలుగురు ఎసిపిలు తో బలగాలను పర్యవేక్షిస్తున్నారు. వాటితోపాటు రైఫిల్, గ్యాస్ పార్టీలను రప్పించారు. వజ్రా 207 వాహనాన్ని సిద్ధం చేశారు. అనకాపల్లి అగ్నిమాపక కేంద్రం శకటాన్ని సిద్ధం చేశారు. ముత్యాలమ్మపాలెంలో ప్రతిచోట వైర్‌లెస్ సెట్‌లను ఏర్పాటుచేసే కార్యక్రమాన్ని చేపట్టారు. మొత్తానికి వీడియో, ఫోటో గ్రాఫర్లను సిద్ధం చేసి గట్టును తొలగించారు..

Thursday, September 6, 2012

శివకాశిలో... ఆహుతి

శివకాశిలో భారీ అగ్నిప్రమాదం

శివకాశిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈఘటనలో 54మంది కార్మికులు చనిపోగా 78మంది కార్మికులు తీవ్రంగా  గాయపడ్డారు. వారిని శివకాశి, మదురై ఆస్పత్రులకు తరలించారు. మంటలు అదుపులోకి తేవడానికి ఐదు గంటలకుపై అగ్నిమాపక సిబ్బంది శ్రమించాల్సి వచ్చింది. బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుళ్లతో మూడు గోడౌన్లు, 40గదులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దాదాపు 200 మీటర్ల మేర మంటలు వ్యాపించాయి. ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు 300మంది కార్మికులకు పైగా పనిచేస్తున్నారు.

శిధిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక  సిబ్బంది చాకచక్యంగా ప్రయత్నించారు. ఇక్కడ ప్రతి ఏటా అగ్ని ప్రమాదాలు సంభవిస్తునే ఉన్నాయి. వందలాది మంది  కార్మికులు చనిపోతున్నారు. అయినా యాజమాన్యాలు గానీ, అధికారులు గానీ సరైన భద్రతా చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. బాణాసంచా తయారీకి శివకాశి భారతదేశంలోనే అతిపెద్ద మార్కెట్.

అయితే దిపావళి సమీపిస్తుండటంతో బాణాసంచా డిమాండ్ పెరిగిన నేపథ్యంలో వందలాది మంది కార్మికులు ముమ్మరంగా పనులు సాగిస్తున్నారు. దీంతో ఎలాంటి జాగ్రతలు పాటించకపోవడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనతో పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అగ్ని ప్రమాదంలో సహాయక చర్యలు చేపట్టేందుకు ఐదుగురు మంత్రులు పర్యవేక్షించనున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.

ప్రమాదంలో చనిపోయిన బాధిత కుంటుంబాలకు ప్రభుత్వం రెండు లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ప్రమాద స్థలాన్ని పరిశీలించేందుకు ముఖ్యమంత్రి జయలిత దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు,

బాధితులను కాపాడేందుకు వెళ్ళిన వారు కూడా తీవ్రగాయాలయ్యాయని ,వారిలో నలుగురు విలేకరులు కూడా వున్నారని అధికారులు తెలిపారు.మంటలు వంద అడుగుల ఎత్తున ఎగసిపడ్డాయి. ఫైర్ ఇంజన్లు వచ్చి మంటల్ని అదుపు చేసాయి. ఎక్కువమంది అనుభవంలేని కార్మికులు ఉండటంతోనే ఈ ప్రమాదం సంభవించిందని తెలిసింది.శివకాశి కి ఏడు  కిలోమీటర్ల దూరం లోని సదానందపురం లో ఈ ప్రమాదం జరిగింది.