Thursday, December 6, 2012

ఎన్టీఆర్ విగ్రహం మహాచార్య శిల్పి చెక్కనున్నారా ?


తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ఎలుగెత్తి చాటిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ. రామారావు విగ్రహాన్ని పార్లమెంట్‌లో ఏర్పాటు చేయనున్నారు. ఈ శిల్పాన్ని హైదరాబాద్‌కు చెందిన మహాచార్య అనే శిల్పి చెక్కనున్నారు. విగ్రహాన్ని తామే సమర్పిస్తామని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు పోటీపడినా, చివరకు ఆ అవకాశం మాత్రం పురందశ్వరికే దక్కింది. పార్లమెంట్‌లో ఎన్టీఆర్ విగ్రహాన్ని సమర్పించాలని లోక్ సభ సెక్రటరీ జనరల్ కేంద్ర మంత్రి, ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరికి సూచించిన సంగతి తెలిసిందే. ఈ విగ్రహం రాజ్యసభ ఆరో నంబర్ విశ్రాంతి మందిరం పక్కన, తమిళ నేత మురసోలి మారన్ విగ్రహం ఎదురుగా ప్రతిష్టించనున్నారు.




Wednesday, November 28, 2012

జగన్ గూటికి… పూరి ‘జగన్’!



క్సెస్ న్యూస్  చెప్పింది…. అక్షరం పొల్లు పోలేదు. ‘పూరి జగన్.. జగన్ మనిషా...?అని  ఇదివరకే విశ్లేషనాత్మక కథను  రచించింథి. జగన్ అడుగులకు మడుగులు వత్తుతూ… జగన్ పిలుపు కోసం కళ్ళు కాయలు కాచేలా ‘పూరి జగన్’ కుటుంబం ఎదురు చూస్తోందని సక్సెస్ న్యూస్ చెప్పింథి. వై యస్ జగన్ కుటుంబంపై తన సానుభూతిని, అభిమానాన్ని తెలియపరచడానికి ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమాని ఓ ఆయుధంలా పూరి వాడుకున్నాడని సక్సెస్ న్యూస్ వ్యక్తం చేసింది. పూరి జగన్నాద్ కుటుంబం జగన్ పార్టీ తీర్ధం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం అవుతోంది.వై యస్ ఆర్ కాంగ్రెస్స్ పార్టీకి ఎప్పటినుంచో సినీ గ్లామర్ కొరత. సినిమా రంగం నుంచి వెళ్లి ఆ పార్టీకి అండగా నిలబడినవాళ్ళు ఇప్పటి వరకూ లేరనే చెప్పాలి. మరో వైపు చిరంజీవి పార్టీ ఫిరాయించడంతో కాంగ్రెస్స్ కి… కావలసినంత గ్లామర్ దొరికింది. తెలుగుదేశం కి మాత్రం సినీ గ్లామర్ కావలసినంత వుంది. అందుకే 2014 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జగన్ పార్టీ సినీ గ్లామర్ సమీకరణాల్లో పడింది. ఎప్పటినుంచో పూరి జగన్నాద్…. జగన్ కి చేరువకావడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. రాజశేఖర రెడ్డి మరణాంతరం ఆయన జీవిత కధ ఆధారంగా ఓ సినిమా తీయాలని భావించారు. ‘రాజశేఖరరెడ్డి’ అని నామకరణం కూడా చేసారు. అందులో రాజశేఖర్ ని కధానాయకుడిగా ఎంచుకున్నారు. మరెందుకో ఆ సినిమా సెట్స్ పైకి వెళ్ళలేదు. సినిమా ప్లాన్ విజయవంతం కాకపోయినా… జగన్ దృష్టి పూరి పై పడింది. జగన్ సోదరుడు గణేష్ తెలుగుదేశం పార్టీ జండా మోసినవాడే. జగన్ పార్టీ స్థాపించడంతో అటువైపు దూకారు. జగన్ పాదయాత్రలో భాగంగా పూరి స్వగ్రామం వెళ్ళారు.


అప్పటినుంచి జగన్ తో పూరి జగన్నాద్ కుటుంబ స్నేహానికి బీజం పడింది.ఉప ఎన్నికల ప్రచారంలోవిజయలక్ష్మి, షర్మిల  బస… పూరి ఇంట్లోనే. పూరి జగన్నాధ్ ఇంట్లో జరిగిన ఓణీల పండక్కి జగన్ అతిధిగా వచ్చారు. ఆ తరవాత కూడా జగన్ చాలా సందర్భాల్లో వై యస్ కుటుంబం పై తన అభిమానాన్ని ప్రకటించుకున్నారు. “నేను ఇప్పటివరకూ కేవలం 5 సార్లు మాత్రమె దిన పత్రిక చదివాను. వై యస్ రాజశేఖర రెడ్డి మరణించినప్పుడు చివరిసారిగా న్యూస్ పేపర్ చదివాను. ఆ తరవాత నుంచి ఇప్పటివరకూ ముట్టుకోలేదు” అని స్వయంగా ఓ ఇంటర్వ్యూ లో చెప్పారు. ‘… రాంబాబు’ సినిమా ద్వారా పూరి కి మరో అవకాశం దొరికింది. ఆ సినిమాలో ముఖ్యమంత్రి పాత్ర.. దానికి పెట్టిన పేరు వై యస్ ని పోలి వుంటుంది. అంతే కాదు.. వై యస్ పాదయాత్ర గొప్పదనాన్ని కుడా అందులో ఉటంకించారు. రాజశేఖర్ రెడ్డి ప్రధాన రాజకీయ శత్రువు… చంద్రబాబు నాయుడి ని విమర్శించడం పరాకాష్ట. ఈ సినిమా కేవలం రాజశేఖర రెడ్డి ని హీరోగా చూపించడానికి, తెలంగాణాపై తన అభిప్రాయాన్ని చెప్పడానికి సాకుగా తీసాడని… చిత్ర సీమలో పెద్ద దుమారమే రేగింది. అవన్నీ ఊహాగానాలు కాదనే విషయం క్రమంగా రాష్ట్ర ప్రజలకు బోధ పడుతోంది.2014 ఎన్నికలలో జగన్ పార్టీ తరపున పూరి కుటుంబం ప్రచారం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అంతేకాదు.. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలూ వున్నాయి. పూరి తమ్ముడు గణేష్ కి నర్సీపట్నం అసెంబ్లీ టికెట్ ఇస్తారని సమాచారం.


అందుకోసం గణేష్ ఇప్పటినుంచే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. దాని కంటే పూరి భార్య లావణ్య కు అనకాపల్లి యం.పీ సీటు ఇస్తే మంచిదని జగన్ పార్టీ భావిస్తోంది. అనకాపల్లి పార్లమెంట్ సెగ్మెంట్లో చివరి నిమిషాల్లో స్వయంగా పూరి జగన్నాద్ రంగంలోకి దిగినా షాక్ కి గురి కావలసిన అవసరం లేదు. ఎందుకంటే సినిమాల్లోనే కాదు…. రాజకీయాల్లోనూ ఏదైనా జరగొచ్చు. మొత్తమ్మీద అనకాపల్లి పార్లమెంట్ పై జగన్ పార్టీ ముందస్తు దృష్టి పెడుతోంది. దానికి… పూరి జగన్నాద్ సినీ ఇమేజ్ ని అస్త్రంగా వాడుతోంది. మరి… ఫలితాలు ఎలా ఉంటాయో తెలియాలంటే… కొన్నాళ్ళు నిరీక్షించాల్సిందే.

Wednesday, November 21, 2012

ముంబై పేలుళ్ల ఘటనలో నిందితుడైన కసబ్‌కు ఉరిశిక్ష అమలు


కసబ్ ఉరిశిక్షను ధృవీకరించిన మహారాష్ట్ర హోంశాఖ

ముంబై పేలుళ్ల కీలక సూత్రధారి మహ్మద్ అజ్మల్ అమీర్ కసబ్ ను బుధవారం ఉదయం పూణే సమీపంలోని ఎర్రవాడ జైలులో ఉరి తీశారు. క్షమాభిక్ష పిటిషన్ ను భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరస్కరించడంతో కసబ్ కు ఉరిశిక్షను అమలు చేశారు. కసబ్ ఉరిశిక్షను మహారాష్ట్ర హోంశాఖ అధికారులు ధృవీకరించారు. ముంబైలోని ఆర్థర్ రోడ్ నుంచి ఈ ఉదయం రహస్యంగా పూణేలోని ఎర్రవాడ జైలుకు తరలించారు.
2008 నవంబర్ 26 తేదిన ముంబైలో మారణహోమం సృష్టించిన సంఘటనలో కసబ్ కీలక సూత్రధారి. ముంబై పేలుళ్ల తర్వాత కసబ్ పట్టుబడ్డారు. ఈ ఘటనలో వందలాది మంది మృతికి కారణమయ్యారు. భారత్ లో కల్లోలం సృష్టించడానికి పాకిస్థాన్ పన్నిన కుట్ర.. కసబ్ దొరకడం వల్లనే బట్టబయలైంది. 
* 26/11 దాడుల్లో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. 
* ముంబైపైలో మారణహోమంలో పాకిస్థాన్ కు చెందిన 10 మంది ఉగ్రవాదులు పాల్గొన్నారు. 
* 2008 లో పట్టుబడిన లష్కరే తోయిబాకు చెందిన కసబ్ ను ముంబైలని ఆర్థర్ రోడ్ జైలులోని బుల్లెట్ ఫ్రూఫ్ జైలు గదిలో ఉంచారు. 
* ఫిబ్రవరి 21 తేదిన బాంబే హైకోర్టు కసబ్ కు ఉరిశిక్ష విధించింది
* కసబ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ ను నవంబర్ 5 తేదిన ప్రణబ్ ముఖర్జీ తిరస్కరించారు.



Tuesday, November 20, 2012

ఐపీఎస్ ల బదిలీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్


పీఎస్ బదిలీల జీవోను ప్రభుత్వం ఎట్టకేలకు విడుదల చేసింది. ఇప్పటి వరకూ ఉత్కంఠతో కొనసాగిన ఐపీఎస్ ల జీవోల బదిలీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ ల బదిలీల జీవోపై సంతకం  చేశారు. రాష్ట్రంలో 43మంది ఐపీఎస్ లను బదిలీ చేస్తూ  ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీల్లో ఏసీబీ మాజీ డీజీ భూపతిబాబుకు అప్రాధాన్యత పోస్టు లభించింది.
విశాఖ పోలీస్ కమీషనర్ గా శివధర్ రెడ్డి, జైళ్ల శాఖ డీజీగా టి.కృష్టంరాజు, ఏసీబీ డైరెక్టర్ గా విశ్వజిత్, వెస్ట్ జోన్ డీసీపీ స్టీఫెన్ రవీంద్రా గ్రేహౌండ్స్ కు బదిలీ చేసింది. రైల్వే శాఖ అదనపు డీజీగా భూపతిబాబు, సీబీఐ అదనపు డైరెక్టర్ గా కృష్ణప్రసాద్, సీఐడీ డీఎస్పీ రమణమూర్తి ఫైర్ సర్వీస్ కు బదిలీ చేసింది.
విజిలెన్స్ ఐజీగా కె.సత్యనారాయణ ఎల్బీనగర్ డీసీపీగా రవివర్మ, హైదరాబాద్ క్రైమ్ అదనపు కమీషనర్ గా సందీప్ శాండిల్య, గుంటూరు రేంజ్ ఐజీగా రవిగుప్త, పోలీస్ అకాడమీ జాయింట్ డైరెక్టర్ గా ఈ.దామోదర్ ఏపీఎస్సీ బెటాలియన్ ఐజీగా కే.ఆర్ .ఎం.కిషోర్ కుమార్, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా టీ.పీ.దాస్, తూర్పు గోదావరి జిల్లా ఎస్పీగా శివశంకర్ రెడ్డిని,విశాఖ పోలీస్ కమీషనర్ గా పని చేసిన పూర్ణచంద్రరావును  శాంతిభద్రతల విభాగం ఐజీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

Saturday, November 17, 2012

దువ్వాడ రైల్వేస్టేసన్ లో ఒక మహిళ ట్రైన్ లో పడి మ్రుతిచెందింథి


స్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ ఒక మహిళ దువ్వాడ రైల్వేస్టేసన్ లో శనివారం ఉదయం ఎక్కుతుండగా ట్రైన్ కదిలిపోయింథి దీంతో ఆమె పట్టాలపై పడి అక్కడకక్కడే మ్రుతిచెందింది.