Saturday, September 28, 2013

01అవును సమైక్యాంధ్ర ముఖ్యమంత్రినే : సీఎం కిరణ్

 02రాష్ట్ర విభజన విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరోసారి కుండబద్దలు కొట్టి చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే లక్ష్యమని స్పష్టం చేశారు. సమైక్యాంధ్ర కోసం అవసరమైతే ముఖ్యమంత్రి పదవిని వదులుకునేందుకు సిద్ధమేనని ప్రకటించారు.
03రాష్ట్రాన్ని విడదీయడం అంత తేలికైన విషయం కాదన్న కిరణ్, దిగ్విజయ్ సింగ్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. పదవుల కంటే ప్రజల ముఖ్యమని వెల్లడించారు. పార్టీకి విధేయుడంటూనే ధిక్కార స్వరం వినిపించారు. 
04ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరోసారి విభజన విషయంలో తన నిర్ణయాన్ని మరోమారి వెల్లడించారు. రాష్ట్ర విభజన విషయంలో సీడబ్ల్యూసీ తాను లేవనెత్తిన అంశాలపై ఒక్క దానికి కూడా భరోసా ఇవ్వలేదన్నారు. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలను విడదీయడం అంత తేలిక కాదన్నారు.

05సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని వ్యతిరేకించడం లేదంటూనే కాంగ్రెస్ పార్టీకి విధేయుడినంటూ ధిక్కార స్వరం పెంచారు. సీఎం క్యాంప్ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. ఉద్యోగుల ఉద్యమాన్ని కేంద్రం గుర్తించిందని, సీమాంధ్ర ఉద్యోగులు తక్షణమే సమ్మె విరమించాలని సీఎం కిరణ్ విజ్ఞప్తి చేశారు.

06విభజన వల్ల సాగునీటి రంగానికి ఎంత నష్టం వాటిల్లనుందో ప్రజలకు వివరించాల్సిన బాధ్యత తనపై ఉందని కిరణ్ స్పష్టం చేశారు. ప్రాజెక్టుల నుంచి సాగునీటి సరఫరాను మ్యాప్ ద్వారా వివరించారు. 1956లో రాష్ట్రం కలిసి ఉండాలని, ఫజల్ అలీ కమీషన్ చెప్పిందని గుర్తు చేశారు. 

07నీళ్లు బాగా వచ్చినప్పుడు ఏ సమస్యా ఉండదని, నీళ్లు లేనప్పుడే అసలు సమస్య ప్రారంభమవుతుందని కిరణ్ కుమార్ తెలిపారు. రాష్ట్రం విడిపోతే జలయుద్ధాలు తీవ్రమవుతాయన్నారు. నీటి సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎలా పరిష్కరిస్తుందో కేంద్రం చెప్పాలని కిరణ్ డిమాండ్ చేశారు. 
   
08విభజన అంశంపై సీడబ్ల్యూసీ నిర్ణయం సరైంది కాదన్న కిరణ్ జవహార్ లాల్ నెహ్రూ, పటేల్ గట్టి బంధాన్ని ఏర్పరచారని తెలిపారు. తర్వాత ఇందిరా గాంధీ ఆ బంధాన్ని మరింత గట్టిగా చిక్కుముడి వేశారని గుర్తు చేశారు. సీడబ్ల్యూసీ నిర్ణయం శిలా శాసనం అయితే నెహ్రూ, ఇందిరల నిర్ణయాలు అటువంటివి కావా అని ఆయన ప్రశ్నించారు. ఉద్యోగులకు భద్రత లేదని, లక్షా 60మంది ఉద్యోగులు ఎవరు ఏ జోన్ పరిధిలోకి వస్తారో ఎలా నిర్ణయిస్తారని కిరణ్ ప్రశ్నించారు. ఉద్యోగ విరమణ తరువాత పెన్షనర్లకు ఫించన్ ఎలా చెల్లిస్తారో చెప్పాల్సిన అవసరముందన్నారు.
 
09రాష్ట్రం సమైక్యంగా ఉంటుందంటే తన పదవిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నానని కిరణ్ స్పష్టం చేశారు. సీఎం పదవి శాశ్వతం కాదని, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ దిగ్విజయ్ సింగ్ పదవి కూడా శాశ్వతం కాదన్నారు. చంద్రబాబు, వైఎస్సార్సీపీల్లాగా పదవి కోసం పాకులాడాల్సిన అవసరం లేదన్న ఆయన సీమాంధ్రలో జరుగుతున్న ప్రజా ఉద్యమంలో రాజకీయ నేతలను ప్రజలు రానీవ్వడం లేదన్న విషయాన్ని కిరణ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు.
 
10అటు కిరణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఆయన మూడు ప్రాంతాల గురించీ ఆలోచిస్తారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ ఒకటికి రెండుసార్లు చెప్పినమాటిది. అవును నేను సమైక్యాంధ్ర సీఎంనేనంటూ నొక్కి మరీ చెప్తున్నారు కిరణ్ కుమార్.

11సీఎం వ్యాఖ్యలపై సీమాంద్రలో  సంబరం  
12విభజన అంశంపై సీఎం చేసిన వ్యాఖ్యలకు సీమాంద్రలోని కాంగ్రెస్ శ్రేణులు హర్షాతీరేకం వ్యక్తంచేశాయి. టపాసులు పేల్చి సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలనీ, తెలంగాణ రాష్ట్ర ప్రకటన వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రం సమైక్యంగా వుండడం వల్లనే అభివృద్ది సాధ్యమని నెహ్రూ, ఇందిరాగాంధీ వంటి నాయకులు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే ప్రయత్నం చేశారన్నారు. 

No comments:

Post a Comment