Sunday, February 17, 2013
Saturday, February 16, 2013
వందల కోట్ల రూపాయలు కు సిమ్స్ శఠగోపం...!!???
వందల కోట్ల రూపాయలు డిపాజిట్లుగా సేకరించి శఠగోపం పెట్టిన కంపెనీల జాబితాలో తాజాగా 'సిమ్స్' కూడా చేరింది. ఈ కంపెనీ గత మూడు నెలలుగా ఖాతాదారులకు వడ్డీ చెల్లించడంలేదు. నిలదీస్తున్న వారికి ఎప్పటికప్పుడు సర్దిచెబుతూ జాప్యం చేసింది. డిపాజిటర్ల నుంచి ఒత్తిడి పెరగడంతో అందరికీ 15వ తేదీన సొమ్ము చెల్లిస్తామని, ఆందోళన చెందవద్దని పేర్కొంది. ఆ మేరకు డిపాజిటర్లు ఎక్కడికక్కడ స్థానిక కార్యాలయాలకు వెళ్లారు. అయితే అక్కడ డబ్బులు ఇచ్చే పరిస్థితి ఏమీ లేకపోవడంతో ఆందోళనకు దిగారు. కొన్నిచోట్ల ఫర్నీచర్ ధ్వంసం చేయగా, మరికొన్నిచోట్ల తీసుకెళ్లిపోయారు.మ్యాజిక్, రాగ మాదిరి గానే బోర్డు తిప్పేసిన ఫైనాన్స్ సంస్థల లిస్టులోకి ఇప్పుడు తాజాగా సిమ్స్ సంస్థ చేరిందంటూ ఖాతాదారులు ఆందోళనకు దిగారు. ఖాతాదారులకు గత మూడు నెలల నుండి చెల్లింపులు నిలిచిపోవటంతో పాటు బుధవారం(15-02-13) నుండి సంస్థ ఎమ్‌డి సెల్‌ఫోన్ పనిచేయకపోవడంతో బాధితులు లబోదిబోమంటూ కార్యాలయం చుట్టు తిరుగుతున్నారు. నగరంలోని అక్కయ్యపాలెం సమీపంలో సుమారు నాలుగేళ్ళ క్రితం కె.సురేంద్రగుప్తా ‘సెక్యూరిటీ ఇన్వెస్ట్మెంట్ మేకింగ్ సర్వీసెస్’ (సిమ్స్) పేరుతో ప్రైవేట్ సంస్థను ఏర్పాటు చేశాడు. సంస్థలో డైరెక్టర్లను, ఏజెంట్లను నియమించి రూ.లక్ష చెల్లిస్తే వారానికి రూ.8వేలు చొప్పిన వడ్డీ చెల్లిస్తామని గుప్తా ప్రచారం చేశారు. దీంతో అనేకమంది ఖాతాదారులు ఇందులోకి చేరడంతో అధిక మొత్తంలో నగదు చేకూరడంతో జిల్లాలోని అనకాపల్లి, చోడవరం, తదితర ప్రాంతాల్లో బ్రాంచ్ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. వ్యాపారం బాగా వృద్ధి చెందడంతో కొద్ది నెలల క్రితం మద్దిలపాలెం ప్రాంతంలో శాఖ కార్యాలయాన్ని గుప్తా ప్రారంభించారు. ఇదిలా ఉండగా గత మూడు నెలలుగా సిమ్స్‌లో ఖాతాదారులకు పేమెంట్లు ఇవ్వకపోవడంతో సంస్థపై పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో అనేకమంది ఖాతాదారులు సిమ్స్ కార్యాలయానికి చేరుకుని తమ పేమెంట్లు గురించి సిబ్బందిని నిలదీస్తుండడంతో ఈనెల 15న పేమెంట్లు ఇస్తామని, కంగారు పడాల్సిన అవసరం లేదని వారం రోజుల క్రితం పలు పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు. ఈ తరుణంలో శుక్రవారం సిమ్స్ ఆఫీసు వద్దకు ఖాతాదారులు వెళ్ళగా పేమెంట్లు ఇవ్వడం లేదని తెలుసుకుని తీవ్ర అగ్రహావేశాలకు గురయ్యారు. ఇది గమనించిన సిబ్బంది కార్యాలయాన్ని మూసి వేసి అక్కడ నుండి జారుకున్నారు. ఖాతాదారులు ఏజెంట్లను నిలదీయడంతో వారు ఎమ్‌డి గుప్తా సెల్‌ఫోన్‌ను కాల్ చేయగా స్విచ్ ఆఫ్ చేసి ఉండడాన్ని గమనించారు. దీంతో ఖాతాదారులు లబోదిబోమంటూ ఆందోళన చేశారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు అక్కడకు చేరుకుని ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండ జాగ్రత్తలు తీసుకున్నారు. ఇదిలా ఉండగా సిమ్స్ నిర్వాహకుడు సురేంద్ర గుప్తా ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. సిఐ షేక్‌హుస్సేన్ నేతృత్వంలో నాలుగో పట్టణ పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.Thursday, February 14, 2013
అతి దారుణంగా హత్య చేసిన భర్తకు యావజ్జీవం,
విశాఖ నగర నడిబొడ్డున అందరూ చూస్తుండగా, తన భార్యను అతి కిరాతకంగా కత్తితో నరికిన భర్తకు యావజ్జీవ జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి బుధవారం(13-02-2013)న తీర్పు చెప్పారు. మద్దిలపాలెం - కళాభారతి రోడ్డుపై 2011 మార్చి నాలుగో తేదీన కృష్ణవేణిని ఆమె భర్త రవికుమార్ అతి దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన నగరంలో సంచలనం సృష్టించింది. భార్యను హతమార్చిన రవికుమార్ వెంటనే విజయనగరం పారిపోయాడు. అతని కోసం పోలీసులు గాలించి పట్టుకున్నారు. అప్పట్లో ఈ ఉదంతం పోలీస్ యంత్రాంగాన్ని కూడా ఉలిక్కిపడేలా చేసింది. నడి రోడ్డుపై ఓ మహిళను హతమార్చినా, ఎవ్వరూ కోర్టులో సాక్ష్యం చెప్పడానికి ముందుకు రాలేదు.
అయితే ఘటనా స్థలంలో లభించిన సాక్ష్యాధారాలతో పోలీసులు కేసును పగడ్బందీగా ఫైల్ చేయడంతో నిందితుడు రవికుమార్‌కు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ఈ కేసుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖలో ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న చెల్లుబోయిన రవికుమార్ మద్దిలపాలెంకు చెందిన దువ్వి కృష్ణవేణిని 2010 ఆగస్ట్ 29న వివాహం చేసుకున్నాడు. వివాహ సమయంలో కృష్ణవేణి తల్లిదండ్రులు లక్షా 50 వేల రూపాయల కట్నం, ఆడబడుచులకు 20 వేల రూపాయల లాంఛనాలు ఇచ్చారు. వివాహం చేసుకునే సమయానికి కృష్ణవేణి ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతోంది. కొంతకాలం కలిసి కాపురం చేసిన తరువాత కృష్ణవేణికి వేధింపులు ప్రారంభమయ్యాయి. కృష్ణవేణి తల్లిదండ్రులకు ఒక భవనం ఉంది. ఆ భవనంపై వచ్చే అద్దె తనకు ఇవ్వమని, దాన్ని తనకు రాసివ్వాలని, అదనపు కట్నం తేవాలని కృష్ణవేణిని భర్త రవికుమార్ వేధించడం మొదలుపెట్టాడు. అతనితోపాటు అత్త, మామలు గురమ్మ, సూర్యనారాయణ, ఆడబడుచులు శ్యామలాదేవి, ప్రసన్నకుమారి కూడా కృష్ణవేణిని వేధిస్తుండేవారు. 2011 మార్చి నాలుగో తేదీన కృష్ణవేణి కాలేజీ నుంచి ఇంటికి వస్తుండగా, మద్దిలపాలెం-కళాభారతి రోడ్డులో కొబ్బరి బొండాలు నరికే కత్తితో రవికుమార్ ఆమె గొంతు కోశాడు. తీవ్ర రక్తస్రావంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. కృష్ణవేణి తల్లిదండ్రులు మూడవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కేసు మహిళా న్యాయ స్థానం ముందుకు వచ్చింది. న్యాయమూర్తి ఎన్.రాజా ప్రసాద్ బాబా ఇరుపక్షాల వాదనలు విన్నారు. రవికుమార్‌పై హత్యా నేరం రుజువు కావడంతో అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. అత్త, మామ, ఆడబడుచులకు మూడు సంవత్సరాల చొప్పున శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. వీరికి శిక్షతో పాటు, ఐదు వేల రూపాయల చొప్పున జరిమానా కూడా విధించారు. ఇది చెల్లించకపోతే, ఒక సంవత్సరం అదనంగా జైలు శిక్ష అనుభవించాలని న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ఈ కేసును విచారించేందుకు న్యాయవాది ఎం గోపాలరావును స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమించారు.ఉరిశిక్ష వేయాల్సింది తను కుమార్తెను దారుణంగా చంపిన హంతకుడికి న్యాయమూర్తి ఉరిశిక్ష విధిస్తారనుకుంటే యావజ్జీవ ఖైదుతో సరిపెట్టారని కృష్ణవేణి తల్లి దువ్వి వేను కోర్టు ఆవరణలో కన్నీళ్లు పెట్టుకుంది. పోలీసులు పకడ్బందీగానే కేసు నమోదు చేసినప్పటికీ, కోర్టులో సరైన న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేసింది.
Tuesday, January 15, 2013
గాజువాకలో యువతి దారుణ హత్య
నగరంలోని గాజువాకలో (విశాఖపట్నం)పట్టపగలు దారుణం జరిగింది. మంగళవారం ఉదయం బ్యూటీపార్లర్‌లో పనిచేస్తున్న యువతిని ఓ యువకుడు కత్తితో నరికి దారుణంగా హత్యచేశాడు. శ్రీకన్య థియేటర్ సమీపంలోని స్మైల్ బ్యూటీపార్లర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.వర్సకు మేనమామ అయిన శివ తనను పెళ్ళి చేసుకోవడానికి నిరాకరించిదని నెపం తో కక్స తో రగిలి పోయి ఈ ధారునానికి పాల్పాడ్డాడని అంటున్నారు ఇలాంటి వాడిని నడిరోడ్ లో ఉరి తీయాలని సర్వత్రా డిమాండ్ చేస్తున్నారు,
ఇందుకు సంబదించి...స్తానికులు పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం...
ఇందుకు సంబదించి...స్తానికులు పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం...
కైలాస్‌నగర్ ప్రాంతానికి చెందిన యు బబిత (19) స్థానికంగా ఉన్న ఎంవిఆర్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతోంది. ఆమె తండ్రి ఇటీవలే చనిపోవటంతో తల్లి, అన్నయ్య, అక్కతో కలిసి ఉంటోంది. సింగపూర్‌లో ఉంటున్న ఆమె మేనమామ శివ (36) ఆరు నెలల క్రితం తిరిగివచ్చి స్థానికంగా ఒక కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. బబితను పెళ్లి చేసుకుంటానంటూ వెంటపడుతూ ఆమె ఇంట్లోవారిని ఒప్పించే ప్రయత్నం చేశాడు. అయితే నాలుగు నెలల క్రితం జాతకాలు చూపించటంతో ఇద్దరి జాతకాలు సరిపోలేదు. దీంతో బబిత తరఫు పెద్దలు పెళ్లి ప్రతిపాదనను పక్కన పెట్టారు. శివ మాత్రం బబితనే పెళ్లి చేసుకుంటానంటూ వెంటపడుతూ వేధించేవాడు. బబిత డిగ్రీ చదువుతూనే గాజువాకలో బ్యూటీషియన్‌గా పనిచేస్తుండేది. మంగళవారం విధి నిర్వహణలో భాగంగా ఆమె బ్యూటీ పార్లర్‌కు వచ్చింది. ఆమె వెంటే లోపలికి వెళ్లిన శివ వెంటనే తన వెంట తెచ్చుకున్న కత్తితో గొంతుకోశాడు. బ్యూటీ పార్లర్లో నుండి కేకలు రావడంతో స్థానికులు వచ్చి చూసే సరికి బబిత రక్తపుమడుగులో విగతజీవిగా పడి ఉంది. సమాచారం అందుకున్న గాజువాక పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడు శివను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల సమక్షంలోనే నిందితుడికి స్థానికులు దేహశుద్ధి చేశారు.Thursday, January 10, 2013
తెలగపాముల జాతికి చెందిన మహిళా దొంగలు పట్టుబడ్డారు,
తరుచూ ఆటోల్లో ఎక్కుతూ దిగుతూ మహిళల మెడలో ,బేగల్లో వస్తువులు కాజేస్తున్న తెలగపాముల జాతికి చెందిన దొంగలు వీరే....
తరుచూ ఆటోల్లో ఎక్కుతూ దిగుతూ మహిళల మెడలో ,బేగల్లో వస్తువులు కాజేస్తున్న తెలగపాముల జాతికి చెందిన దొంగలు వీరే....
బంగారు ఆభరణాలను చోరీ చేసిన కేసులో ఇద్దరు మహిళా నిందితులిని దువ్వాడ జోన్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.
వీరిద్దరూ పాతనేరస్తులని పోలీసులు తెలిపారు. జోన్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సౌత్ ఏసీపీ దాసరి రవిబాబు వెల్లడించిన వివరాలు ఇవీ. అగనంపూడి శాంతినగర్‌కు చెందిన కె.సామ్రాజ్యలక్ష్మి కుమార్తె ఉదశ్రీ ఇటీవల అమెరికా నుంచి వచ్చింది. తల్లీ కూతుర్లిద్దరూ ఈనెల ఏడో తేదీన అనకాపల్లి వీనస్ జ్యూయిలరీస్కు వెళ్లి పాతబంగారాన్ని ఇచ్చి కొత్త వస్తువులు కొనుగోలు చేశారు. నగల్ని రెండు పర్సుల్లో పెట్టి ఇంటికి వెళ్లేందుకు అనకాపల్లి పెరుగు బజార్ వద్ద ఆటో ఎక్కారు.
అప్పటికే ఆటోలో కె.కోటపాడు మండలం గొట్లాంకు చెందిన రావాల ఎల్లారమ్మ, విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన బండి లక్ష్మి ఉన్నారు. తాము ముందు జంక్షన్‌లోనే దిగిపోతామని చెప్పి సీటు మారుతున్నట్లు నటిస్తూ సామ్రాజ్యలక్ష్మి బ్యాగులోని ఓ పర్సులోని ఆభరణాలు వీరిద్దరూ కాజేసారు. ఆ తర్వాత వచ్చిన జంక్సన్ లో వారు దిగిపోయారు. దీన్ని గమనించని బాధితులు ఇంటికి వెళ్లి బ్యాగ్ లు చూసుకోగా ఓ పర్సులోని ఆభరణాలు కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.దువ్వాడ జోన్ సీఐ త్రినాథ్ ఆధ్వర్యంలో ఎస్ఐ రాజేష్, ఏఎస్ఐ సూరిబాబు, సిబ్బంది నిందితుల కోసం నిఘాపెట్టారు.
బుధవారం ఉదయం అగనంపూడి ఆంజనేయస్వామి గుడివద్ద నిందితులు సంచరిస్తుండగా అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.75 వేల విలువైన నగలు స్వాధీనం చేసుకున్నారు. కాగా, మరో నిందితుడైన ఆటో డ్రైవర్ బంకు శ్రీను పరారీలో ఉన్నాడని, అతని వద్ద కొంత సొత్తు ఉందని చెప్పారు. నిందితులిద్దరూ పాతనేరస్తులని, అందుకే వీరి కదలికలపై నిఘా పెట్టామని ఏసీపీ దాసరి రవిబాబు వివరించారు.
Sunday, December 23, 2012
రాజకీయంగా ఎదుర్కోలేకే జగన్‌ను జైలు పాలు చేశారు
రాజకీయంగా ఎదుర్కోలేకే జగన్‌ను జైలు పాలు చేశారు
రాజకీయంగా జగన్మోహన రెడ్డిని ఎదుర్కోలేక జైలుపాలు చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్టన్రాయకులు, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఆరోపించారు. జి వి ఎమ్ సి 56వ వార్డ్ పరిథి అగనంపూడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయుకులు గున్నంటి పూర్ణానంథ శర్మ ఆద్వర్యంలో జగన్మోహన రెడ్డి జన్మదినోత్సవ వేడుకలను ఘనం గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ ప్రజాబలం మెం డుగా ఉన్న జగన్మోహనరెడ్డిని ఎదుర్కోలేక కాంగ్రెస్ ప్రభుత్వం సిబిఐను అడ్డం పెట్టుకుని జగన్మోహనరెడ్డిని జైలుపాలు చేశారన్నారు. రైతు కళ్లలో ఆనందభాష్పాలను చూడాలన్న దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఆకాంక్షను తీర్చేందుకు వైఎస్ జగన్మోహన రెడ్డి కంకణం కట్టుకున్నారని, ఆయనకు జన్మదిన కానుక గా సహకార సంఘాల ఎన్నికల్లో అధిక స్థానాలను గెలిపించి అందించాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలపైనా, నాయకులపైనా ఉందన్నారు. జగన్ పిలుపుకోసం రాష్ట్రంలోని మంత్రులు, ఎమ్మెల్యే లు ఎదురుచూస్తున్నారన్నారు. ఎన్ని కుతంత్రాలు పన్నినా జగన్ పార్టీ రానున్న ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోవడం ఖాయమన్నారు. పార్టీ అధికారంలోకి రాగానే వృద్ధులకు ఇచ్చే పెన్షన్‌ను 700రూపాయలు, వికలాంగులకు వెయ్యి రూపాయలుగా అందించేందుకు పార్టీ నిర్ణయించిందన్నారు. అలాగే అమ్మఒడి పేరుతో పిల్లలను ఆదుకుంటామన్నారు. రైతులకు, విద్యార్థులకు, పేదలను అన్ని విధాలా ఆదుకోవడంతోపాటు సాగు, తాగునీటికి పార్టీ ప్రాధాన్యతనిస్తుందన్నారు. అంతకుముందు జగన్ జన్మదిన సందర్భంగా కేక్‌ను కట్‌చేసి స్వీట్లు పం చిపెట్టారు. వృద్ధులకు దుప్పట్లు పంచిపెట్టారు. అనంతరం 2013నూతన క్యాలండర్ ను కొణతాల రామకృష్ణ చేతులు మీదుగా అవిస్కరించారు, ఈ కార్యక్రమంలో నగర అథికారప్రతినిది తిప్పలనాగిరెడ్డి,కొయ్యప్రసాద్ రెడ్డి,చొప్పానాగరాజు,గొలగానిశ్రీను,ఇల్లపు ప్రసాద్, గుర్రంశ్రీను,గళ్ళ అప్పారావు,జె సోమినాయ్డు(సమరా),తులసి,కాతా నూకరాజు, పాల్గొన్నారు
Thursday, December 6, 2012
ఎన్టీఆర్ విగ్రహం మహాచార్య శిల్పి చెక్కనున్నారా ?
తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ఎలుగెత్తి చాటిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ. రామారావు విగ్రహాన్ని పార్లమెంట్లో ఏర్పాటు చేయనున్నారు. ఈ శిల్పాన్ని హైదరాబాద్‌కు చెందిన మహాచార్య అనే శిల్పి చెక్కనున్నారు. విగ్రహాన్ని తామే సమర్పిస్తామని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు పోటీపడినా, చివరకు ఆ అవకాశం మాత్రం పురందశ్వరికే దక్కింది. పార్లమెంట్లో ఎన్టీఆర్ విగ్రహాన్ని సమర్పించాలని లోక్ సభ సెక్రటరీ జనరల్ కేంద్ర మంత్రి, ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరికి సూచించిన సంగతి తెలిసిందే. ఈ విగ్రహం రాజ్యసభ ఆరో నంబర్ విశ్రాంతి మందిరం పక్కన, తమిళ నేత మురసోలి మారన్ విగ్రహం ఎదురుగా ప్రతిష్టించనున్నారు.
Subscribe to:
Posts (Atom)
















