Saturday, May 5, 2012

వీజేఎఫ్‌ అధ్యక్షుడుగా గంట్ల శ్రీనుబాబు


విశాఖపట్నం:(సక్సెస్ న్యూస్): 2012-14 సంవత్సరాలకు వైజాగ్‌ జర్నలిస్టు ఫోరం కార్యవర్గం ఎన్నికల్లో అధ్యక్ష కార్యదర్శిలుగా గంట్ల శ్రీనుబాబు (ఆంధ్రజ్యోతి)ఎస్‌. దుర్గారావు (ఆంధ్రప్రభ),విజయకేతనం ఎగురవేశారు.ఏప్రిల్‌ 22వ తేది ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఉపాధ్యక్షులుగా నాగరాజు పట్నాయక్‌(ఆంధ్రజ్యోతి), నానాజీ
( హెచ్‌ఎంటీవీ) కార్యదర్శిగా సంయుక్త కార్యదర్శులుగా దాడి రవికుమార్‌ (విజన్‌), ఎల్‌.జి. నాయుడు (వార్త), కోశాధికారిగా పి.ఎన్‌.మూర్తి (సాక్షి), కార్యవర్గసభ్యునిగా పి. వరలక్ష్మి,ఈ. ఈశ్వరరావు, డేవిడ్‌రాజు, ఎం.ఎస్‌.ఆర్‌. ప్రసాద్‌, బి. గిరిబాబు, పి. దివాకరరావు, ఎస్‌. మాధవ్‌, శేఖర్‌ మంత్రి, ఎండీ గయాజుద్దీన్‌లు ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలను జిల్లా పౌర సంబంధాల అధికారి బాబ్జీ, అతని సిబ్బంది పర్యవేక్షించారు.


Sunday, April 29, 2012

విశాఖలో చిరంజీవి హల్ చల్....


* గాజువాక, అనకాపల్లిలో పర్యటించిన చిరు



*మెగాస్టార్...తో... గాజువాక ఎమ్మెల్యే(చింతలపూడి) కూతురు అల్లుడు,,,

* అనకాపల్లిలో పార్టీ నేతలతో సమావేశం


రాజ్యసభ సభ్యులు చిరంజీవి విశాఖ జిల్లాలో హల్ చల్ చేశారు. గాజువాక, అనకాపల్లిల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గాజువాక ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య కుమార్తె వివాహానికి హాజరుకాలేక పోయిన చిరంజీవి, శనివారం ఆ దంపతులిద్దరినీ ఆశీర్వదించారు.



గాజువాక అనంతరం అనకాపల్లి పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. అక్కడి నుంచి తూర్పు గోదావరి పర్యటనకు బయల్దేరి వెళ్లారు. చిరంజీవి చూడటానికి భారీ ఎత్తున అభిమానులు తరలివచ్చారు


Sunday, April 1, 2012

చిరంజీవి నెత్తిన తిరుపతి భారం !!!


చిరంజీవి రాజ్యసభకు ఎన్నిక కావడంతో తిరుపతి అసెంబ్లీ సీటుకు ఎన్నికలు అనివార్యమయ్యాయి. తాను ఖాళీ చేసిన ఈ సీటుని తన భార్య సురేఖతో భర్తీ చేయాలని చిరంజీచి మొదట భావించారు. అయితే దీనికి అధిష్టానం సుముఖంగా లేకపోవడంతో పార్టీ ఎవరికీ టిక్కెట్ ఇస్తే వారిని గెలిపించడానికి కృషి చేస్తానని చిరంజీవి మాట వరసకు అన్నారు. అయితే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం వ్యూహాత్మకంగా అభ్యర్థి ఎంపిక బాధ్యతను, అతన్ని గేలించుకునే కర్తవ్యాన్ని కూడా చిరంజీవికే అప్పగించాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ఐదు రోజుల క్రితం 18 శాసనసభ స్థానాల ఎంపిక గురించి మంత్రులతో కిరణ్ కుమార్ రెడ్డి ప్రాథమిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా తిరుపతి అభ్యర్థి ప్రస్తావన వచ్చినప్పుడు ఈ భారం చిరంజీవికే వదిలేద్దామని ఆయన వ్యాఖ్యానించినట్లు తెలిసింది.
దీంతో చిరంజీవికి తిరుపతి బరువు బాధ్యతలు మోయకతప్పేట్లు కనిపించడం లేదు. చిరంజీవికి ఈ బాధ్యతను అప్పగించడం ద్వారా కొంత బరువును దించుకోవడానికి కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఒకవేళ చిరంజీవి సూచించిన అభ్యర్థి ఈ ఎన్నికల్లో ఓడిపోతే ఆ వైఫల్యం చిరంజీవిపై నెట్టివేసి ఆయన పరపతిని తగ్గించవచ్చు. ఒకవేళ చిరంజీవి సూచించిన అభ్యర్థి గెలిస్తే దానికి పెద్ద్డగా రాజకీయ ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఉండదనేది కిరణ్ కుమార్ రెడ్డి వ్యూహంగా తెలుస్తోంది.