యువనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం విశాఖ జిల్లాలో ఓదార్పు యాత్ర ప్రారంభించనున్నారు. దాదాపు పది రోజుల పాటు ఇది సాగనుంది. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి దుర్మరణాన్ని తట్టుకోలేక ఈ జిల్లాలో అసువులు బాసిన 18 మందికి చెందిన కుటుంబ సభ్యులను యువనేత పరామర్శించి ఓదారుస్తారు. జిల్లాలో మొత్తం 15 నియోజకవర్గాల్లో 789 కిలోమీటర్ల మేర ఆయన పర్యటించనున్నారు. మన్యంలోని పాడేరు, హుకుంపేట, కొయ్యూరు మండలాల్లోనూ జగన్ పర్యటనకు ఏర్పాట్లు చేశారు. జిల్లాలో పలుచోట్ల వైఎస్ అభిమానులు ఆయన విగ్రహాలను ఏర్పాటు చేశారు. వీటిని ఓదార్పుయాత్రకు వస్తున్న జగన్‌తో ఆవిష్కరింపచేయనున్నారు.
ఇప్పటిదాకా 103 వైఎస్ విగ్రహాలను ఏర్పాటు చేయగా.. అనేకచోట్ల అభిమానులు మరిన్ని విగ్రహాలను సిద్ధం చేసి యువనేతతో ప్రారంభింపజేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. జగన్ తొలిరోజు పద్మనాభనగర్‌లో కంపర బాబూరావు, రాంపురంలో గండి భూలోకయ్య, లింగాల తిరుగుడులో దొడ్డి కోటేశ్వరరావు కుటుంబాలను పరామర్శిస్తారు. మార్గమధ్యంలోని 14 వైఎస్ విగ్రహాలను ఆవిష్కరిస్తారు. యువనేత యాత్రకు అనకాపల్లి ఎంపీ సబ్బం హరి, మాజీ మంత్రి కొణతాల రామృకృష్ణ నేతృత్వంలో అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి కొద్దిరోజులుగా విశాఖలోనే ఉంటూ యాత్ర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
జగన్‌కు విశాఖ జిల్లా అండగా నిలిచింది. అనకాపల్లి ఎంపీ సబ్బం హరి, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఆది నుంచీ యువనేతకు బహిరంగంగా మద్దతునిస్తున్నారు. పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు కూడా తన మద్దతు ప్రకటించారు. వీరితో పాటు జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ గొర్లె రామ్మూర్తినాయుడు, పద్మ, పెద్దసంఖ్యలో జెడ్పీటీసీ సభ్యులు కూడా జగన్‌కే సంఘీభావం తెలిపారు. నర్సీపట్నం ఎమ్మెల్యే ముత్యాలపాప తన నియోజకవర్గంలో జరిగే యాత్రలో పాల్గొంటారని తెలిసింది. యలమంచిలి ఎమ్మెల్యే రమణమూర్తిరాజు తన కుమారుడిని యాత్రకు పంపుతున్నారు.
ఎమ్మెల్సీ డి.వి.సూర్యనారాయణరాజు, మాజీ ఎమ్మెల్సీ కిడారి సర్వేశ్వరరావు, మాజీ గండి బాబ్జీ, కర్రి సీతారాము, గూనూరు మిలట్రీనాయుడు(ఎర్రునాయుడు), పూడి మంగపతిరావు, కుంభా రవిబాబు, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎం.నాగార్జున, ఏపీటీఎస్ మాజీ చైర్మన్ కొయ్యా ప్రసాదరెడ్డి, ఆర్ఈసీఎస్ చైర్మన్ బొడ్డేడ ప్రసాద్ కూడా యువనేత వెంటే ఉంటామని ఇదివరకే వెల్లడించారు. ప్రజారాజ్యం విశాఖ నగర ఉపాధ్యక్షుడు విళ్లా శ్రీనివాసరావు ఆ పార్టీకి రాజీనామా చేసి జగన్‌కు బాసటగా నిలిచారు. ఇక నగరానికి సంబంధించి జీవీఎంసీకి చెందిన 15 మంది కార్పొరేటర్లూ జగన్‌కు జై కొట్టారు. వీరంతా ఓదార్పుయాత్రలో పాల్గొంటున్నారు.తొలిరోజు యాత్ర ఇలా..
జగన్ సోమవారం హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరి ఉదయం 11 గంటలకు విశాఖ చేరుకుంటారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఓదార్పు యాత్ర ప్రారంభిస్తారు. ఎన్ఏడీకొత్తరోడ్డు, గోపాలపట్నం జంక్షన్, శొంఠ్యాం, గుర్రం పాలెం, పెందుర్తి, రాంపురం, సబ్బవరం జంక్షన్, ఆరిపాక, చినయాతపాలెం, లింగాలతిరుగుడు, అడ్డూరు మీదుగాయాత్ర సాగుతుంది. మధ్యలో సాయంత్రం 5.00 గంటలకు సింహాచలం కొండపై శ్రీలక్ష్మీ నృసింహస్వామిని యువనేత దర్శించుకుంటారు. అర్ధరాత్రి 12.30 గంటలకు కె.కోటపాడులో జరిగే సభతో తొలిరోజు యాత్ర ముగిస్తారు.
Monday, January 3, 2011
పూటకో మాట రోజుకో బాట..: కేసీఆర్‌పై రేవంత్ ధ్వజం..!!
ప్రత్యేక తెలంగాణ అంశంపై తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కే చంద్రశేఖర్ రావు పూటకో మాట రోజుకో బాట పడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి విమర్శించారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై చర్చించడానికి జనవరి 6న కేంద్రం ఆహ్వానించిన అఖిలపక్ష సమావేశాన్ని కేసీఆర్ బహిష్కరించండాన్ని ఆయన తప్పుబట్టారు. తన రాజకీయ లబ్ది కోసమే కేసీఆర్ పనిచేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
చేశారు. తమ పార్టీ మాత్రం ప్రత్యేక తెలంగాణాకు కట్టుబడి ఉందని చెప్పారు.
శ్రీకృష్ణ కమిటీ నివేదికపై చర్చించేందుకు అన్ని పార్టీల అధ్యక్షులు హజరయ్యేలా కేంద్రం ఒత్తిడి తేవాలని ఆయన సూచించారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే అఖిలపక్ష సమావేశానికి సోనియా గాంధీ కూడా హాజరయ్యేలా ఒత్తిడి తీసుకురావాలని అన్నారు. సోనియా తెలంగాణ ఇచ్చేటట్టయితే టీఆర్ఎస్ నేతలు ఎందుకు రాజీనామాలు చేశారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
జనవరి 6న జరగనున్న అఖిలపక్ష సమావేశాన్ని బహిష్కరించనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. పార్టీల నుంచి ఇద్దరు సభ్యులను ఆహ్వానించడాన్ని ఆయన ప్రశ్నించారు. ఇది కేవలం తెలంగాణా అంశాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నమేనని కేసీఆర్ అన్నారు. దీనిపై స్పందించిన రేవంత్ రెడ్డి కేసీఆర్‌ను చూసి ఊసరవెళ్లి కూడా సిగ్గుపడుతోందని ఎద్దేవా చేశారు. తమ పార్టీ మాత్రం ప్రత్యేక తెలంగాణాకు కట్టుబడి ఉందని చెప్పారు
Sunday, January 2, 2011
నాణ్యమైన ఉక్కుకు మరిన్ని పరిశోధనలు
విశాఖపట్నం: స్టీల్‌ప్లాంట్‌లో ప్రమాదాలు జరగకుండా గట్టి భద్రతా చర్యలు చేపట్టాల్సిన అవసరముందని సంస్థ సీఎండీ పి.కె.బిష్ణోయ్ అన్నారు. ఉక్కు మల్టీపర్పస్ హాలులో శనివారం జరిగిన సమావేశంలో అధికారులు, కార్మిక నాయకులు, సీ, విప్స్, ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ ప్రతినిధులనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ప్రమాదాలు లేని సంస్థగా తయారుచేయడానికి ఉద్యోగులంతా సహకరించాలని కోరారు. ఉక్కు ఉత్పత్తిలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నాణ్యత సాధించడానికి మరింత పరిశోధనలు జరగాల్సి ఉందన్నారు. ఆంధ్ర, జార్ఖండ్, రాజస్థాన్‌లో గనుల సాధనకు కృషి చేస్తున్నామని చెప్పారు. విశాఖ ఉక్కును దేశంలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించాల్సి ఉందన్నారు.
డెరైక్టర్ (ఆపరేషన్స్) ఉమేష్‌చంద్ర, డెరైక్టర్ (ప్రాజెక్ట్స్) ఎ.పి.చౌదరి, డెరైక్టర్ (ఫైనాన్స్) పి.మధుసూదన్, డెరైక్టర్ (కమర్షియల్) టి.కె.చాంద్, డెరైక్టర్ (పర్సనల్) వై.ఆర్.రెడ్డి ప్రసంగిస్తూ వ్యక్తిగత క్రమశిక్షణ, ఉత్తమ పని ప్రమాణాలు పాటించడం ద్వారా సంస్థ ఖ్యాతిని మరింత పెంచాలన్నారు. సీవీఓ కె.విద్యాసాగర్ గత ఏడాది విజిలెన్స్ విభాగం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. అనంతరం ఉక్కు క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఉక్కు ఉన్నతాధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
డెరైక్టర్ (ఆపరేషన్స్) ఉమేష్‌చంద్ర, డెరైక్టర్ (ప్రాజెక్ట్స్) ఎ.పి.చౌదరి, డెరైక్టర్ (ఫైనాన్స్) పి.మధుసూదన్, డెరైక్టర్ (కమర్షియల్) టి.కె.చాంద్, డెరైక్టర్ (పర్సనల్) వై.ఆర్.రెడ్డి ప్రసంగిస్తూ వ్యక్తిగత క్రమశిక్షణ, ఉత్తమ పని ప్రమాణాలు పాటించడం ద్వారా సంస్థ ఖ్యాతిని మరింత పెంచాలన్నారు. సీవీఓ కె.విద్యాసాగర్ గత ఏడాది విజిలెన్స్ విభాగం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. అనంతరం ఉక్కు క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఉక్కు ఉన్నతాధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పఠనాభిలాషను పెంచుకోవాలి: పార్థ సారథి
విజయవాడ : పఠనా భిలాష ద్వారా వ్యక్తి ఆలోచనా ధోరణి మారుతుందని రాష్టమ్రంత్రి కె.పార్థసారథి అన్నారు. నగరంలోని స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేసిన 22వ విజయవాడ పుస్తక మహోత్సవాన్ని మంత్రి శనివారం సాయంత్రం ప్రారంభించారు. 11 రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనలో 290 మంది ప్రచురణ సంస్థలు పాల్గొంటున్నాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. 22 ఏళ్లుగా నిర్విరామంగా పుస్తక మహోత్సవాన్ని నిర్వహిస్తూ విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ నగరానికి తలమానికంగా నిలిచిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పీయూష్‌కుమార్, బుక్ ఫెస్టివల్ సొసైటీ కార్యదర్శి అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణా ఇస్తే సరే.. లేదంటే జగన్ లేదా నేనే సీఎం..?: కేసీఆర్!!!
శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో తెలంగాణా ఇవ్వమని చెప్పినా చెప్పకపోయినా తమకు కావలసింది తెలంగాణా రాష్ట్రమని తెరాస చీఫ్ కేసీఆర్ అన్నారు. ఫిబ్రవరి పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టాల్సిందేనని ఆయన డిమాండ్ చేస్తున్నారు. జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ నివేదిక తెలంగాణకు అనూకూలంగా ఉంటే సరేసరి, వ్యతిరేకంగా ఉంటే మాత్రం కాంగ్రెస్ పనిపడతామని ఆయన హెచ్చరించారు.
అంతేకాకుండా, తన చిరకాల ప్రత్యర్థి వైఎస్ తనయుడు వైఎస్.జగన్‌తో సైతం చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు సైతం ఆయన సంకేతాలు పంపుతున్నట్టు సమాచారం. తద్వారా తెలంగాణలో మనం (తెరాస), సీమాంధ్రలో వైఎస్.జగన్ క్లీన్‌స్వీప్ చేసి రాష్ట్రాన్ని రెండున్నరేళ్ళు చొప్పున పాలించేలా కేసీఆర్ భవిష్యత్ వ్యూహాలను రచిస్తోన్నట్టు వినికిడి.
ఒకవేళ పార్లమెంటులో తెలంగాణా బిల్లు పెట్టకపోతే సీమాంధ్రలో అధికార, ప్రతిపక్ష పార్టీల గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తున్న వైఎస్ జగన్‌తో చేతులు కలిపేందుకు వెనుకాడబోమని తెరాసకు చెందిన నేతలు బాహాటంగానే ప్రకటిస్తున్నారు. తెలంగాణా ఏర్పాటు అంశంపై కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘంగా ఆలోచించుకునేందుకు సంవత్సరకాలం పాటు తెలంగాణా ప్రజలు ఇచ్చారనీ, ఇక అంతకుమించిన సమయాన్ని ఇవ్వలేరని చెపుతున్నారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని అటు సీమాంధ్రలోనూ, ఇటు తెలంగాణాలోను పూర్తిగా దెబ్బతీసేందుకు జగన్‌తో చేతులు కలపాలని కేసీఆర్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇటీవల కేసీఆర్ వరంగల్‌లో జరిపిన మహాగర్జనకు వైఎస్ జగన్ పరోక్షంగా మద్దతు ప్రకటించడమే కాకుండా, బహిరంగ సభ నిర్వహణ కోసం రూ.ఐదు కోట్లు కూడా ఇచ్చినట్టు భొగొట్టా. ఇవన్నీ చూస్తుంటే రాష్ట్రంలో ఇటు తెలంగాణ, అటు వైఎస్.జగన్‌లు కలిసి కాంగ్రెస్‌ను పూర్తిగా నిర్వీర్యం చేసేలా కనిపిస్తోంది. ఈ క్లిష్ట పరిస్థితులను కాంగ్రెస్ ఏ విధంగా అధిగమిస్తుందో వేచి చూడాల్సిందే.
Saturday, January 1, 2011
జగన్ పార్టీలో చేరికపై ఆచితూచి నిర్ణయం: నటి జయసుధ
కడప మాజీ ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేయనున్న కొత్త పార్టీలో చేరే విషయంపై ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని సికింద్రాబాద్ ఎమ్మెల్యే, సినీ నటి జయసుధ అన్నారు. ఆమె శనివారం గాంధీభవన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగనున్నట్టు తెలిపారు. జగన్ ఏర్పాటు చేయబోయే కొత్త పార్టీలో చేరే విషయంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. తన రాజకీయ భవిష్యత్‌ను నిర్ధేశించే అంశమైనందువల్ల దీనిపై ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
అంతకుముందు ఆమె ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్‌తో సమావేశమయ్యారు. వీరిద్దరు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. పార్టీ ప్రభుత్వ నిర్ణయాల్లో కొత్త ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని ఏమాత్రం పరిగణనలోకి తీసుకోక పోవడం సరైన పద్దతి కాదన్నారు. ఇదే విషయాన్ని డీఎస్ వద్ద ప్రస్తావించినట్టు చెప్పారు. భవిష్యత్‌లో ఇలాంటివి మరోమారు పునరావృత్తం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరినట్టు జయసుధ తెలిపారు.
విజయవాడలో వైఎస్.జగన్మోహన్ రెడ్డి చేపట్టిన లక్ష్యదీక్షలో పాల్గొనడం పార్టీ నియమావళికి వ్యతిరేకం కాదన్నారు. ఇది వ్యక్తిగతంగానే అక్కడకు వెళ్లి జగన్‌కు సంఘీభావం తెలిపినట్టు ఆమె తెలిపారు.
ఇవ్వకుంటే అగ్నిగుండమే.. కేసీఆర్ : అంత సీనొద్దు.. సీమాంధ్ర
రాష్ట్ర విభజం అంశంపై తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, సీమాంధ్ర నేతల మధ్య మాటలయుద్ధం ముదురుతోంది. కేసీఆర్ రెచ్చకొట్టేలా వ్యాఖ్యలు చేస్తే.. సహించే ప్రసక్తే లేదని సీమాంధ్ర నేతలు హెచ్చరిస్తున్నారు. తామేమీ చేతులు ముడుచుకుని కూర్చోలేదని వారు అంటున్నారు.
ప్రత్యేక రాష్ట్ర తెలంగాణ ఏర్పాటు చేయకుండా ఎదో ఒక తిరకాసు పెడితే తిరగబడతామని కేసీఆర్ అన్నారు. అంతేకాకుండా రాష్ట్ర ఇవ్వకుంటే అగ్నిగుండం అవుతుందని హెచ్చరించారు. దీనిపై సీమాంధ్ర నేతలు భగ్గుమన్నారు. తామేమీ చేతులు ముడుచుకుని కూర్చోలేదని ప్రకటించారు.
ఇదిలావుండగా, తెలంగాణ రాష్ట్ర లక్ష్య సాధనపై ఈనెల ఆరో తేదీన తమ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను వెల్లడిస్తామని ప్రకటించారు. అలాగే, సీమాంధ్ర నేతలు కూడా ఈనెల 6వ తేదీన అఖిలపక్ష సమావేశం ఏర్పాటు ఒక నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు.
Subscribe to:
Posts (Atom)




