రాష్ర్ట విభజన నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని విశాఖపట్టణం(వైజాగ్),తిరుపతిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మోదీ హామీ ఇచ్చారు. ఏపీకి పదేళ్లపాటు ప్రత్యేక హోదా కల్పించాలని వెంకయ్య నాయుడు అప్పట్లో పార్లమెంట్‌లో పోరాటం జరిపారు. ఇప్పుడు మోదీ తనమాట నిలబెట్టుకోవాల్సిన సమయం వచ్చింది.అయితే ఆంధ్రలో బాజాప పుంజుకుంటుదన్న సమయంలో తప్పులు దిర్లిస్తున్నారు. రాష్ర్ట విభజన సమయంలో వున్న పరిస్థితుల కారణంగా కేంద్ర ప్రభుత్వంతోపాటు అన్ని రాజకీయ పార్టీలు విభజనకే మొగ్గు చూపాయి. అయితే, రెండు రాష్ర్టాలకు సమ న్యాయం చేసిన తర్వాతే ఏ నిర్ణయమైనా తీసుకోండని అప్పట్లో చంద్రబాబునాయ్డు సూచించినప్పటికీ అందరూ తన మాటని పెడచెవిన పెట్టారు.రాష్ర్ట విభజన తో ఒక్క కాంగ్రేస్ పార్టీనే యావత్ తప్పు పడుతున్నప్పటికిని దానంతటికి కారణం బాజాప అనక తప్పదు..ఇలాగే వ్యవహరించుకు పోతుంటే వాళ్ళకి పట్టిన గతే పడతాది.
Thursday, March 5, 2015
Tuesday, March 3, 2015
అర్ధనగ్నంగా రేవ్ పార్టీ... ఫైనాన్షియర్లు, యువతులు అరెస్ట్
రేవ్ పార్టీల సంస్కృతి క్రమంగా దేశంలోని పలు ప్రధాన నగరాలకు విస్తరిస్తోంది.రేవ్ పార్టీ కల్చర్ బీచ్ సిటీ వైజాగ్‌కి కూడా పాకింది. బీచ్ పరిసరాలతోపాటు నగర శివార్లలోని కొన్ని రిసార్ట్స్, ఫామ్ హౌజ్‌లలో తరచూ రేవ్ పార్టీలు జరుగుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఓ ఫామ్ హౌజ్‌లో రేవ్ పార్టీ జరుగుతుందన్న సమాచారంతో తాజాగా, విశాఖపట్నంలోని ఓ రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. పరవాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్టీపీసీ సమీపంలో ఓ గెస్ట్ హౌస్‌లో రేవ్ పార్టీ జరుగుతున్నట్లు తెలుసుకున్న పోలీసులు, గెస్ట్ హౌస్‌పై దాడి చేశారు. ఆరుగురు మహిళలను, నలుగురు ఫైనాన్షియర్లను అరెస్టు చేశారు. మరో 40 మంది పరారయ్యారు. హైదరాబాద్ శివార్లలో గత కొంతకాలంగా ఇలాంటి రేవ్ పార్టీలు జరుగుతుండటం తెలిసిందే. ఇప్పడు ఈ రేవ్ పార్టీల కల్చర్
విశాఖలోనూ కనిపించడంతో సామాజికి వేత్తలను కలవరపెడుతుంది.
Subscribe to:
Posts (Atom)