సినీనటి, సమాజ్‌వాదీ పార్టీ మాజీ నేత బీజేపీలో చేరుతున్నారన్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు ఆమె బీజేపీలో చేరేందుకు ఆ పార్టీకి చెందిన సీనియర్ లీడర్లతో చర్చలు జరుపుతున్నట్లు ఆమె చెప్పారు. అయితే పార్టీలో సామాన్య కార్యకర్తగానే ఉంటానని…ఎలాంటి ఎన్ని
కల్లో పోటీ చేయనన్నారు జయప్రద. కేజ్రీవాల్ పై పోటీకి దిగుతానని గతంలో చెప్పారన్న విషయంపై ఆమె మాట్లాడుతూ…అలాంటి కామెంట్లు ఎప్పుడూ చేయలేదని చెప్పింది. మోడీ లీడర్ షిప్ లో పనిచేయాలనే ఆలోచనలో ఉన్నట్లు జయప్రద ప్రకటించారు. అయితే బీజేపీ నేతలతో తాను మాట్లాడటం లేదని…అమర్ సింగ్ మాట్లాడుతున్నారని చివర్లో మరింత క్లారిటీ ఇచ్చారు జయప్రద.ఈ విషయాన్ని గతంలోనూ వెల్లడించినా ఆమె తాజాగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇకనుంచి డర్టీ పాలిటిక్స్‌కు స్వస్తి చెప్పి ఆరోగ్యకరమైన రాజకీయాలను మాత్రమే చేయదలచుకున్నారన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంపై ఉన్న నమ్మకంతోనే బీజీపీలో చేరడానికి సిద్ధమని తెలిపారు.